Asianet News TeluguAsianet News Telugu

తన రెండో వివాహం వెనుక ఏమి జరిగిందో... పూర్తిగా ఓపెన్ అయిన దిల్ రాజు

 ఈ విషయమై ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. తన రెండో పెళ్లి వెనుక అసలేం జరిగింది అనే విషయాలను ఆయన వివరంగా చెప్పారు.  

Dil Raju opens about his second marriage at ABN
Author
First Published Nov 29, 2022, 3:56 PM IST


ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి  2020 డిసెంబర్ లో  నిరాడంబరంగా జరిగింది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. 49 ఏళ్ల వయసులో దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.   నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో రాత్రి 11 గంటల సమయంలో వివాహం చేసుకున్నారు. 

దిల్ రాజు పెళ్లి వార్త బయటకు రాగానే.. అటు ఇండస్ట్రీలోనూ బయటి జనంలో కూడా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువతి ఎవరు? ఎందుకు చేసుకున్నారు అనే  డిస్కషన్స్ మొదలయ్యాయి. దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆయన కూతురు హన్షిత రెడ్డి అన్నీ తానై చూసుకుంది. ఈ విషయమై ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. తన రెండో పెళ్లి వెనుక అసలేం జరిగింది అనే విషయాలను ఆయన వివరంగా చెప్పారు. దీనిపై ఆయన ఏమన్నారంటే..

దిల్ రాజు మాట్లాడుతూ.... ‘‘నా భార్య అనిత చనిపోయే సమయానికి నాకు 47 ఏళ్లు. నేను పక్కా ఫ్యామిలీ మ్యాన్‌ని. ఉన్నట్లుండి భార్యను కోల్పోవడంతో ఎమోషనల్‌గా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. నేను రోజంతా ఎక్కడ ఉన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తా. పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతా. అలాంటిది హఠాత్తుగా భార్యను కోల్పోవడంతో ఇంట్లో పరిస్తితి చాలా ఇబ్బందికరంగా మారింది. రెండేళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయాను.

 భార్య మరణించాక రెండేళ్లు నా కూతురు, అల్లుడు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా సరే లోటు తీరలేదు. అప్పుడు నాకు మళ్లీ పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నా ఆలోచించారు. నా కూతురు కూడా అదే అనుకుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను ఆ దిశగా పుష్ చేశారు. అప్పుడు ఆప్షన్లు చూశాం. వేరే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూడా పరిశీలించాం. వైదా నాకు కరెక్ట్ అనిపించింది. అంతకుముందు తనతో పరిచయం లేదు.

అయితే నాతో పెళ్లి అంటే ఆమెకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. సెలబ్రెటీ అంటే ప్లస్సులుంటాయి. మైనస్‌లు ఉంటాయి. సినిమాలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాలు తనతో మాట్లాడాక, అంతా ఓక అనుకున్నాక పెళ్లికి రెడీ అయ్యాం. తర్వాత నాకు బిడ్డ పుట్టాడు. నా మొదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలిసొచ్చేలా వాడికి ‘అన్వయ్’ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది’’ అని దిల్ రాజు వివరించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios