Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సినిమా ఎలా ఉండాలనేదానికి నాలుగు కమిటీలుః దిల్‌రాజు..

చిత్రపరిశ్రమలోని సమస్యలపై నేడు(గురువారం) ఫిల్మ్ ఛాంబర్‌లో మీటింగ్‌ నిర్వహించారు. ఇందులో ఫెడరేషన్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, గిల్డ్ ఇలా అన్ని సంఘాలు సమస్యలపై చర్చించినట్టు తెలుస్తుంది. 

dil raju interesting comments on tfi and shooting issues
Author
Hyderabad, First Published Aug 4, 2022, 5:27 PM IST

రానున్న రోజుల్లో తెలుగు సినిమా ఎలా ఉండాలనేదానికి నాలుగు కమిటీలు వేసినట్టు చెప్పారు నిర్మాత దిల్‌రాజు. సినీ పరిశ్రమకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ సుప్రీం అని, దాని సారథ్యంలోనే మిగిలిన అసోసియేషన్లు రన్‌ అవుతాయని తెలిపారు. చిత్రపరిశ్రమలోని సమస్యలపై నేడు(గురువారం) ఫిల్మ్ ఛాంబర్‌లో మీటింగ్‌ నిర్వహించారు. ఇందులో ఫెడరేషన్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, గిల్డ్ ఇలా అన్ని సంఘాలు సమస్యలపై చర్చించినట్టు తెలుస్తుంది. 

ఇందులో ప్రధానంగా విడుదలైన సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీలో రావాలి? థియేటర్స్ లో వీపీఎఫ్‌ ఛార్జీలు ఎంత ఉండాలి? కార్మికుల వేజెస్‌, హీరోల పారితోషికం, ప్రొడక్షన్‌ కాస్ట్ తగ్గించుకోవడం వంటి అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ, నిర్మాతలందరం కలిసి షూటింగ్‌లు ఆపేశామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు అంశాలపై చర్చిస్తున్నట్టు చెప్పారు. సినిమాలు ఓటీటీలో ఎన్ని వారాల తర్వాత రావాలనేదానికి ఓ కమిట్‌ వేసినట్టు తెలిపారు. 

మరోవైపు థియేటర్స్ లో వీపీఎఫ్‌ ఛార్జీలు, పర్సెంటీజీలు ఎలా ఉండాలనేదానిపై కూడా ఓ కమిటీ వేశామన్నారు. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతుందని, ఆ తర్వాత ఫెడరేషన్‌ వేజెస్‌, వర్కింగ్‌ కండీషన్స్ పై కూడా కమిటీ వేసినట్టు తెలిపారు దిల్‌ రాజు. నిర్మాతలకు ప్రొడక్షన్‌ కాస్ట్ తగ్గింపు, వర్కింగ్‌ కండీషన్స్, షూటింగ్స్ నెంబర్‌ ఆఫ్‌ అవర్స్ జరగాలంటే ఏం చేయాలనే దానిపై కూడా ఓ కమిటీ వేసినట్టు చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ నాలుగు అంశాల మీద నాలుగు కమిటీలు వేశామని, ప్రస్తుతం అవి పని చేస్తాయని పేర్కొన్నారు. 

కానీ కొందరు సోషల్‌ మీడియాలో ఏవేవో రాస్తున్నారని, మా అందరికీనెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశ్యం లేదన్నారు. నిర్మాతకు ఏదీ భారం కాకూడదని, గత మూడు రోజుల నుంచి నాలుగు మీటింగ్స్ జరిగాయని, నాలుగు కమిటీలు వర్క్ చేస్తున్నట్టు పేర్కొన్నారు దిల్‌రాజు. త్వరలోనే ఆ రిజల్ట్ వస్తుందని,ఆ తర్వాత తెలుగు సినిమా ఎలా ఉండాలనేదానికి ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కరించి మళ్లీ షూటింగ్‌లు యదావిధిగా ప్రారంభిస్తామన్నారు. 

మరోవైపు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు మంచు విష్ణుతో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్స్ బంద్‌పై, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు చర్చించినట్టు మంచు విష్ణు తెలిపారు. తమ సినిమాల్లో `మా` సభ్యులకు ఎక్కువగా అవకాశాలివ్వాలని, అలాగే కొత్తవారు `మా` సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని దిల్‌రాజుని కోరినట్టు మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్‌రాజుకి అందించారు. మరోవైపు `మా` సభ్యులకు అవకాశాలు కల్పించాలని కోరుతూ విష్ణు నిర్మాతలను కలవబోతున్నారని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios