అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చితం ‘డీజే(దువ్వాడ జగన్నాథమ్)’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం జూన్ 23 2017న రిలీజ్ అయ్యింది. . ఈ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ బ్రాహ్మణ యువకుడి పాత్రలో తనదైన నటన కనబరిచాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అప్పుడు మంచి కలక్షన్స్ తో సూపర్ హిట్టైంది. అయితే అప్పట్లో వంద కోట్ల పోస్టర్ వేయటంతో వివాదాస్పదమైంది. రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినా ఆ టాపిక్ ఇంకా సోషల్ మీడియా, ఫ్యాన్స్ చర్చల్లో వాడి వేడిగానే ఉంది. రిలీజ్ సమయంలో వీకెండ్స్ తో పాటు రంజాన్ సెలవులు కలిసి రావడంతో ఐదురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డీజే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చెప్పారు. 78 కోట్ల షేర్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచిందని ట్రేడ్ తేల్చింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఆ టాపిక్ ని దిల్ రాజు ముందు ఉంచటంతో అందరికీ పనిగట్టుకుని గుర్తు చేసినట్లు అయ్యింది.
దిల్ రాజు లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. తాను తన సినిమాలకి పెద్దగా కలెక్షన్స్ పోస్టర్స్ అనౌన్స్ చేయనని కానీ డీజే చిత్రానికి చేయడంతో అంతా చాలా గందరగోళంగా మారింది అని అన్నారు. అయితే డీజే చిత్రానికి నిజంగానే 100 కోట్లు వచ్చాయి కాబట్టే 100 కోట్ల పోస్టర్ వేశామని అందులో ఎలాంటి అబద్దం లేదని క్లియర్ కట్ గా చెప్పేసారు. దీనితో అయితే డీజే చిత్రానికి వచ్చిన అనౌన్స్ చేసిన వసూళ్ళలో ఎలాంటి అబద్దం లేదని అందరికీ కన్ఫర్మ్ చేసారు. అయితే దిల్ రాజు చెప్పింది మేము నమ్మం అనే బ్యాచ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది.
ఇక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంలో బన్ని కారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీశ్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ పాత్రల్లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కుర్రాడిగా బన్నీ చెప్పిన డైలాగ్‌లు సూపరో సూపరస్య సూపర్భ్యః అని తెగ మెచ్చుకున్నారు. బడిలో గుడిలో పాట విషయంలో వచ్చిన వివాదాలు కూడా సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి.
పంచెకట్టులో పద్దతిగా కనిపించినా.. మాస్ మసాలా సీన్స్ లోనూ ఇరగదీశాడు. హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ షో.. రావు రమేశ్ విలనిజం.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్ని కలగలిపి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రం విడుదలై ఇన్నేళ్లు అవుతున్నా టీవీల్లో, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ‘డీజే’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్ వర్షన్‌లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం బన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శక్తత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప -2’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ సినిమాను పట్టాలెక్కించి బిజీగా ఉన్నారు.
