#DilRaju: ఆ సినిమాని హిందీ రీమేక్ చేస్తున్న దిల్ రాజు, గన్ షాట్ సక్సెసే
ఈ సినిమాని వేరే భాషల్లోకి కూడా తీసుకెళ్లాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ముందుగా ఆయన హిందీకు రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దిల్ రాజు ఎప్పుడూ ఏదో విషయంలో ట్రెండింగ్ లో ఉంటూంటారు. ఆయన తీసుకునే డెసిషన్స్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తూంటాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే...
మూడు వారాల క్రితం తమిళంలో విడుదలైన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ `లవ్ టుడే`. తెలుగులో రీమేక్ చేయకుండా డబ్బింగ్ రూపంలో నిన్న విడుదల చేశారు దిల్ రాజు. స్టార్ క్యాస్టింగ్ లేని ఈ ఎంటర్ టైనర్ మీద చెన్నై మీడియా ప్రశంసలు ఓ రేంజ్ లో దక్కాయి. చాలా కాలం తర్వాత థియేటర్లు మొత్తం యూత్ తో నిండిపోతున్నాయి. రీమేక్ చేస్తే ఆ ఫీల్ మిస్సవుతుంది. ఆ ఒరిజినల్ ఫీల్ మిస్ కాకుండా ఉండేందుకు డబ్బింగ్ చేసి తీసుకొచ్చారు. రిలీజ్ రోజు ఓపినింగ్స్ డల్ గా ఉన్నా.. సాయంత్రానికి ఫుల్ పికప్ తో మెల్లగా ఆడియన్స్ పెరగడం మొదలయ్యింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాని వేరే భాషల్లోకి కూడా తీసుకెళ్లాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ముందుగా ఆయన హిందీకు రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తమిళ ఒరిజనల్ నిర్మాతలతో కలిసి హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. ఈమేరకు చర్చలు జరుగుతన్నాయి. ప్రస్తుతానికి హీరో ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు కానీ ప్రదీప్ రంగనాథన్ కాకుండా హిందీలో క్రేజ్ ఉన్న యంగ్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నారు. రాజ్ కుమార్ రావు కానీ ఆయుష్మాన్ ఖురానాతో కాని రీమేక్ చేసే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజుకి `జెర్సీ` , `హిట్` సినిమాలను హిందీలో రీమేక్ చేసిన అనుభవం ఉంది కాబట్టి తమిళ నిర్మాతలు సై అన్నారు. ఇప్పటికే హిందీలో జెర్శీ, హిట్ రెండు రీమేకులు చేసి దెబ్బ తిన్న దిల్ రాజు ఈ సినిమా తో అక్కడ నిర్మాతగా సక్సెస్ అవ్వాలని భావిస్తున్నారు.
‘నాకు నీ గురించి మొత్తం తెలుసు బేబీ. ఐ లవ్యూ’ అనే మాట నుంచి ‘నాకు నీ గురించి మొత్తం తెలుసనుకున్నాను. కానీ అస్సలేమీ తెలీదని అర్థం అయింది. అయితే ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను.’అనే మాట వరకు జరిగే జర్నీనే ‘లవ్ టుడే’. ప్రదీప్ రంగనాథన్ 2017లో తీసిన ‘అప్పా లాక్’ అనే నాలుగు నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు.