`ఎఫ్‌3`లో హైలైట్ ఇదే.. వైరల్‌ అవుతున్న న్యూస్‌

వివరాల్లోకి వెళితే..విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలుగా వెండితెరపై మరోసారి నవ్వుల వర్షం పూయించేందుకు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్‌ రావిపూడితో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ‘ఎఫ్‌-2’. 2019లో విడుదలైన ఈ సినిమాకు స్వీకెల్‌గా ‘ఎఫ్‌-3’ తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ వైరల్‌ అవుతుంది.

Dil Raju advice to Venkatesh and Varun Tejs F3 Storyline jsp

విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలుగా వెండితెరపై మరోసారి `ఎఫ్‌3`తో నవ్వుల వర్షం పూయించేందుకు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్‌ రావిపూడితో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ‘ఎఫ్‌-2’. 2019లో విడుదలైన ఈ సినిమాకు స్వీకెల్‌గా ‘ఎఫ్‌-3’ తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించి పలు హైలైట్‌ పాయింట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో వెంకీ రే చీకటి సమస్యతో బాధపడే వ్యక్తిగా కనిపిస్తాడట. ఇది హిలేరియస్‌గా ఉంటుందని టాక్‌. `ఎఫ్ 2` లో అంతేగా.. అంతేగా అనే మ్యానరిజం బాగా పాపులర్ అవడంతో.. ఇప్పుడు `ఎఫ్ 3`లో ఇంకాస్త డిఫ్రెంట్ మేనిరిజాన్ని ట్రై చేస్తున్నారని చెప్తున్నారు.  

‘‘ఎఫ్‌-2’లో భార్యలపై ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న మన హీరోలు ‘ఎఫ్‌-3’లో డబ్బు వల్ల ఫ్రస్ట్రేషన్‌కు గురి కానున్నారు. కో బ్రదర్స్‌ వెంకీ, వరుణ్‌ జీవితాల్లో మరింత ఫన్‌ నింపుదాం’ అని చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ చిత్రం కాన్సెప్టు దేనిచుట్టూ తిరగనుందో చెప్పేసింది. ‘ఎఫ్‌-2’లో నటించిన తమన్నా, మెహరీన్‌.. ఈ సీక్వెల్‌లోనూ సందడి చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ బయిటకు వచ్చింది.  ఈ చిత్రం లో కథ ప్రకారం హీరోలిద్దరూ తమ భార్యలు బాగా ఖర్చు పెట్టేస్తూంటే ఎదురు చెప్పలేక సైలెంట్ గా ప్రస్టేట్ అవుతూంటారు. 

ఈ క్రమంలో తమ సంపాదన తమ భార్యల ఖర్చులకు సరిపోవటం లేదని భావించి..అందుకోసం ఓ ప్లాన్ చేస్తారు. ఓ పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. తోడు అళ్లల్లు ఇద్దరూ దాన్ని రన్ చేస్తూంటారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు..వారి ఫ్యామిలీలను ఎలా డిస్ట్రబ్ చేసాయి. చివరకు వారు ఆ సమస్యల నుంచి ఎలా బయిటపడ్డారు అనేది ఫన్నీగా నడుస్తుందని, ప్రతీ సీన్ ...ఫన్ తో నిండిపోయి అలరిస్తుందని చెప్తున్నారు.  ఇందులో నిజమెంతా అనేది సినిమా చూస్తే గాని తెలియదు. మొత్తానికి `ఎఫ్‌2`ని మించి హిలేరియస్‌గా ఈ సీక్వెల్‌ని ప్లాన్‌ చేసినట్టు సమాచారం. 

  అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ ‘F2’కు సీక్వెల్‌గా ‘F3’ తెరకెక్కిస్తున్నాం.  బాలీవుడ్‌లో వచ్చిన ‘గోల్‌మాల్’ సినిమా సిరీస్‌లా వరుసగా తీయాలని ఉంది.  ఈ సినిమాలో కథకే ప్రాధాన్యం ఉంటుంది. ’’ అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios