అదంతా ఫేక్ అంటూ ఎవరూ మోసపోవద్దని, తాము ఎలాంటి కాస్టింగ్ కాల్ ని నిర్వహించటం లేదని తెలియచేసారు. RC15/SVC50  సినిమాల నిమిత్తం ఆర్టిస్ట్  కాస్టింగ్ కాల్ ఇచ్చామనేది పూర్తిగా ఫేక్ అని తెలియచేసారు. మా తరుపున ఏ కంపెనీ కానీ ఏజెన్సీ కానీ ఏ ఆర్ధరైజెడ్ పర్శన్స్ కానీ పనిచేయటం లేదు అన్నారు. 


సోషల్ మీడియాలో రకరకాల మోసాలు జరుగుతూంటాయి. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు పేరు చెప్పి చాలా మంది మోసాలకు దిగుతూంటారు. అలాంటి మోసపూరిత ప్రకటన ఒకటి మీడియాలో గత రెండు రోజులుగా సర్కులేట్ అవుతోంది. రామ్ చరణ్ ,శంకర్ చిత్రం కాంస్టింగ్ కాల్ అంటూ ఆ ప్రకటన సారాంశం. ఆ సినిమాలో కొన్ని కీలకమైన పాత్రలకు ఎంపిక జరుగుతోందని ఆ ప్రకటనలో ఉంది. ఇది చాలా మంది ఔత్సాహికులను ఉత్సాహరుస్తోంది. ఈ విషయం దిల్ రాజు వరకూ చేరింది. ఆయన ఈ విషయమై అఫిషియల్ గా ప్రకటన ఇచ్చారు.

అదంతా ఫేక్ అంటూ ఎవరూ మోసపోవద్దని, తాము ఎలాంటి కాస్టింగ్ కాల్ ని నిర్వహించటం లేదని తెలియచేసారు. RC15/SVC50 సినిమాల నిమిత్తం ఆర్టిస్ట్ కాస్టింగ్ కాల్ ఇచ్చామనేది పూర్తిగా ఫేక్ అని తెలియచేసారు. మా తరుపున ఏ కంపెనీ కానీ ఏజెన్సీ కానీ ఏ ఆర్ధరైజెడ్ పర్శన్స్ కానీ పనిచేయటం లేదు అన్నారు. ఈ విషయమై జాగ్రత్తగా ఉండమని కోరుతున్నామని తెలియచేసారు.

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్‌. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్‌ వినిపించాయి.

తాజాగా ‘అధికారి’ అనే టైటిల్‌ తెరపైకి వచ్చింది. చరణ్‌ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్‌ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ టైటిల్‌కి పాన్‌ ఇండియా అప్పీల్‌ కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌కి పూర్తవుతుందని తెలుస్తోంది.