'RX100' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతికి టాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరిగింది. చాలా మంది కుర్రహీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. 

'RX100' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతికి టాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరిగింది. చాలా మంది కుర్రహీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. హీరో రామ్.. అజయ్ తో ముందుగా సినిమా చేయాలనుకున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇద్దరి మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. ఓ కథ కూడా ఓకే అనుకున్నారు. కానీ సడెన్ గా ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి పూరితో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటించడానికి రెడీ అయిపోయాడు. అజయ్ భూపతి ప్రాజెక్ట్ నుండి రామ్ బయటకి రావడానికి గల కారణాలు ఇప్పుడు బయటకొచ్చాయి.

అజయ్ చెప్పిన కథలో రామ్ కొన్ని మార్పులు సూచించాడట. ఈ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఈగోలకు పోయి సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రామ్ వెంటనే పూరితో సినిమా అనౌన్స్ చేయడంతో అజయ్ భూపతి అదే కథను హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాడు.

బెల్లంకొండ మాత్రం కథలో ఎలాంటి మార్పులు సూచించలేదని తెలుస్తోంది. ఆ విధంగా రామ్ చేయాల్సిన సినిమా బెల్లంకొండ చేతుల్లోకి వచ్చింది. అజయ్ భూపతి భవిష్యత్తులోనైనా రామ్ తో కలిసి పని చేస్తాడేమో చూడాలి!