బిగ్‌బాస్‌4 ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది. రెండో వారంలో ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారనే విషయాన్ని బిగ్‌బాస్‌ నాగార్జున శనివారం స్పష్టం చేశారు. అంతేకాదు రెండో వారం ఫస్ట్ ఎలిమినేషన్‌గా కరాటే కళ్యాణిని ఇంటికి పంపించేశాడు. రెండో ఎలిమినేషన్‌ ఆ రాత్రి ఉండబోతుంది.

రెండో ఎలిమినేటర్‌ ఎవరనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కుమార్‌ సాయి, అమ్మా రాజశేఖర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్‌ కాబోతున్నారని ఊహాగనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఓ ట్విస్ట్ చోటుచేసుకోబోతుందట. ఎవరూ ఊహించిన విధంగా దేత్తడి హారిక ఎలిమినేట్‌ కాబోతుందని తెలుస్తుంది. 

అయితే ఆమెని పూర్తిగా హౌజ్‌ నుంచి పంపించేయకుండా ఓ సీక్రెట్‌ హౌజ్‌లో ఉంచబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ సీక్రెట్‌ హౌజ్‌లో ఆమె ఏం చేయబోతుంది? అందులో పెట్టడానికి రీజన్‌ ఏంటి? అనేది రాత్రి నాగ్‌ వివరిస్తాడని సమాచారం. 

మరి ఆమె ప్రత్యేకమైన ఎలిమినేటరా? లేక రెండో వారం రెండో ఎలిమినేటరా? అన్నది సస్పెన్స్ నెలకొంది. మొత్తంగా ఈ ఆదివారం `బిగ్‌బాస్‌4` మరింత రసవత్తరంగా సాగబోతుందని చెప్పొచ్చు.