SIR Review: 'సార్' మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎమోషన్ తో కట్టిపడేసిన ధనుష్, అదొక్కటే మైనస్

క్రేజీ హీరో ధనుష్ తొలిసారి చేస్తున్న తెలుగు చిత్రం 'సార్'. యువదర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంయుక్త మీనన్ హీరోయిన్. ఈ చిత్రంపై తెలుగు తమిళ భాషల్లో సాలిడ్ బజ్ ఉంది.

Dhanush SIR movie  twitter review

క్రేజీ హీరో ధనుష్ తొలిసారి చేస్తున్న తెలుగు చిత్రం 'సార్'. యువదర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంయుక్త మీనన్ హీరోయిన్. ఈ చిత్రంపై తెలుగు తమిళ భాషల్లో సాలిడ్ బజ్ ఉంది. ఇటీవల విడుదలైన సార్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సార్ చిత్రం విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే విధంగా ఉండబోతోంది. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. 

అయితే ముందుగానే ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. దీనితో ప్రీమియర్స్ చూస్తున్న అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారంగా మారింది.. చదువుని అడ్డు పెట్టుకుని ప్రజల బలహీనతతో ఆడుకుంటూ కొందరు ఎలా కోట్లు సంపాదిస్తున్నారు అనే అంశాలని దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంలో అద్భుతంగా చూపించాడు. 

Dhanush SIR movie  twitter review

ఎంటెర్టైమెంట్ ఇస్తూనే ఇన్స్పైర్ చేసే విధంగా, ఆలోచించే విద్ధంగా అతని రచన ఉంది. ఇక ధనుష్ నటన అయితే గూస్ బంప్స్ తెప్పిస్తూనే.. ఎమోషనల్ గా కట్టి పడేస్తోంది. ధనుష్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ లలో ఈ చిత్రం కూడా ఒకటిగా మిగలనుంది అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. సార్ చిత్రం చూశాను. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ చాలా బావుంది. చాలా సన్నివేశాలు మంచి హై ఇచ్చాయి. కమర్షియల్ గా కూడా వర్కౌట్ అవుతుంది. ధనుష్ కి తెలుగులో ఇది డీసెంట్ డెబ్యూ అని ఓ నెటిజన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

సార్ అద్భుతమైన చిత్రం. ఇందులో హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్నాయి. ధనుష్ నటన, వెంకీ అట్లూరి రచన ప్రతి ఒక్కరిని మెప్పిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి సోల్ లాగా ఉంటుంది. యునానిమస్ బ్లాక్ బస్టర్ అని మరో నెటిజన్ పేర్కొన్నారు. 

సార్ మూవీ స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉంది. కానీ స్క్రీన్ ప్లే బావుంది. ధనుష్ నటన మెయిన్ హైలైట్. తొలిప్రేమ తర్వాత వెంకీ అట్లూరి నుంచి వచ్చిన బెస్ట్ వర్క్ ఈ చిత్రం. 3.5 స్టార్ రేటింగ్ మూవీ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 

Dhanush SIR movie  twitter review

సార్ చిత్రం మంచి మెసేజ్ తో సాఫీగా సాగిపోయేలా ఉంటుంది. ఈ చిత్ర కాన్సెప్ట్, ఫస్ట్ హాఫ్ , ధనుష్ నటన,సంయుక్త మీనన్ పెర్ఫామెన్స్ పాజిటివ్ అంశాలు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని డల్ మూమెంట్స్, కథ ఊహించగలిగే విధంగా ఉండడం మైనస్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేసారు. 

సార్ చిత్రంలో కాన్సెప్ట్ సింపుల్ గా ఉంటుంది. కానీ ఎమోషనల్ బలంగా తాకేలా ఉంటాయి. జివి ప్రకాష్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ధనుష్ నటన గురించి చెప్పనవసరం లేదు అంటూ మరో నెటిజన్ చెప్పుకొచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios