SIR Review: ధనుష్ 'సార్' ప్రీమియర్ షో టాక్.. గూస్ బంప్స్ తెప్పించే మాస్టారు, మనసులు గెలిచినట్లేనా
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన తాజా చిత్రం 'సార్'. ధనుష్ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రైట్ మూవీ ఇదే. దీనితో సార్ చిత్రంపై తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉత్కంఠ, సాలిడ్ బజ్ ఉన్నాయి.
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన తాజా చిత్రం 'సార్'. ధనుష్ నే మెప్పించి ఆయనతో సినిమా చేయడం మామూలు విషయం కాదు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ధనుష్ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రైట్ మూవీ ఇదే. దీనితో సార్ చిత్రంపై తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉత్కంఠ, సాలిడ్ బజ్ ఉన్నాయి.ఇటీవల విడుదలైన సార్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సార్ చిత్రం విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే విధంగా ఉండబోతోంది.
విద్యా వ్యవస్థని ఎలా వ్యాపారంగా మార్చుతున్నారో అనే అంశాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ధనుష్ స్టైల్, యాటిట్యూడ్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 17న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. కానీ అప్పుడే ప్రీమియర్ షోల హంగామా మొదలైపోయింది. ప్రీమియర్ షోల నుంచి సార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
సముద్ర ఖని ఈ చిత్రంలో విలన్ రోల్ పోషిస్తున్నారు. సముద్రఖని త్రిపాఠిగా నటిస్తున్నారు. ఆయన విద్యాసంస్థల అధినేత. విద్యనే వ్యాపారంగా మార్చుకుని కోట్లు గడించే వ్యక్తి. ధనుష్ బాలు అనే జూనియర్ లెక్చరర్ గా నటిస్తున్నాడు. సాధారణ జూనియర్ లెక్చరర్ కి, విద్యాసంస్థల అధినేతకు ఎలా పోరాటం జరిగింది అనేది ఈ చిత్రంలో ఆసక్తిగా ఉంటుంది.
చూస్తుంటే కాస్త రఘువరన్ బిటెక్ చిత్రం గుర్తుకు రావచ్చు. కానీ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులని ఎంగేజ్ చేసేలా, ఎంటర్టైన్ చేసేలా సాగుతుంది. విద్యకు సంబంధించిన కథ కాబట్టి క్లాస్ పీకినట్లు బోరింగ్ గా కాకుండా వెంకీ అట్లూరి ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని మార్చారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేసి.. ప్రైవేట్ విద్యాసంస్థల ద్వారా ప్రజల డబ్బు దోచుకునే కుట్ర పన్నుతాడు త్రిపాఠి. అతడి విద్యాసంస్థలలోనే జూనియర్ లెక్చరర్ గా ఉన్న బాలు.. ఈ కుట్రని ఎలా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బాలుకి ఎదురైనా సవాళ్లు ఏంటి అనేది కథాంశం. ఫస్ట్ హాఫ్ ధనుష్ పెర్ఫామెన్స్ తో సాఫీగా సాగిపోతుంది. ఒక సాంగ్ బావుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కామెడీ కూడా వర్కౌట్ అయ్యేలాగే ఉంది.
వెంకీ అట్లూరి రాసిన డైలాగులు ఆలోచన రేపే విధంగా ఉంటాయి. ఎమోషనల్ గా కూడా ఈ చిత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మరింత ఎమోషనల్ గా మారుతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో పడ్డ కొన్ని స్లో సన్నివేశాలే కాస్త మైనస్ అని చెప్పాలి.
సంయుక్త మీనన్ పాత్ర కూడా బావుంది. హైపర్ ఆది సపోర్టింగ్ రోల్ ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ సంగీతం కథని మరింత ఎలివేట్ చేసింది అనే చెప్పాలి. ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ధనుష్.. స్టైట్ గా చేసిన తొలి తెలుగు చిత్రంతోనే సాలిడ్ మార్క్ వదిలిపెట్టాడు. ప్రీమియర్స్ లో ప్రతి ఒక్కరిని నుంచి సార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి.