Asianet News TeluguAsianet News Telugu

ధనుష్ - రజినీకాంత్.. మరో బిగ్ ప్రాజెక్ట్!

 

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో మరోసారి ఆయన మేనల్లుడు ధనుష్ వర్క్ చేయబోతున్నాడు. వెండితెరపై ఇద్దరు కనిపిస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నప్పటికీ ఇంకా దానికి సమయం పట్టేలా ఉంది.

dhanush rajinikanth combo one again
Author
Hyderabad, First Published May 9, 2019, 2:54 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో మరోసారి ఆయన మేనల్లుడు ధనుష్ వర్క్ చేయబోతున్నాడు. వెండితెరపై ఇద్దరు కనిపిస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నప్పటికీ ఇంకా దానికి సమయం పట్టేలా ఉంది. ఇకపోతే ఇదివరకే రజిని కాలా సినిమాను నిర్మించిన  ధనుష్ మామయ్యకు అనుకున్నంత రేంజ్ లో హిట్టివ్వలేకపోయాడు. 

ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్టివ్వాలని మళ్ళీ పేట కాంబోని సెట్స్ పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ మురగదాస్ డైరెక్షన్ లో ఒక పొలిటికల్ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. ఆ సినిమా అయిపోయాక పేట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు. ధనుష్ ఇదే సినిమాను బారి బడ్జెట్ లో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేట సినిమా ద్వారా కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. కోలీవుడ్ లో ఓ వర్గం ప్రేక్షకులకు ఆ సినిమా బాగానే నచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. తెలుగులో అయితే ఆ సినిమా రిలీజ్ కావడానికె చాలా ఇబ్బంది పడింది. మరి ఇప్పుడైనా ధనుష్ మామయ్య సినిమాను అందరికి నచ్చేలా నిర్మిస్తాడో లేదో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios