కోలీవుడ్‌ హీరో ధనుష్‌ వరుసగా తెలుగు దర్శకులతో సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. తాజాగా మరో తెలుగు డైరెక్టర్‌కి ఓకే చెప్పారట. 

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ వరుసగా తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శేఖర్‌ కమ్ములతో సినిమా ప్రారంభం కానుంది. తాజాగా మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. అది ఎవరో కాదు ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల రాధాకృష్ణ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేసేందుకు ధనుష్‌ ఓకే చెప్పారని టాక్.

ఇప్పటికే ధనుష్‌.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో `సర్‌` అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన కాలేజ్‌ లెక్చరర్‌(మాస్టర్)గా కనిపించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. విడుదలకు రెడీ అవుతుంది. ఇందులో సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సమకాళీన అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. మరోవైపు సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ధనుష్‌. భారీ పీరియాడికల్‌ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారట. 

1950లో ఆంధ్రా, తమిళనాడు మధ్య ఉన్న సంబంధాల గురించి ఇందులో చూపించబోతున్నారట. ఏషియన్‌ సినిమాస్‌ పతాకంపై ఇది తెరకెక్కబోతుంది. త్వరలోనే తెరకెక్కబోతుంది. మరోవైపు ఇప్పుడు రాధాకృష్ణకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే వార్త అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే వరుసగా ముగ్గురు దర్శకులతో సినిమా చేయబోతున్నారని చెప్పొచ్చు.