గత ఏడాది విడుదలైన వాడా చెన్నై చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ధనుష్ సరసన ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్ నటించారు. వెట్రి మారన్ ఈ చిత్రానికి దర్శకుడు. వెట్రి మారన్, ధనుష్ కాంబినేషన్ లో తాజాగా వస్తున్న మరో చిత్రం అసురన్. ఈ చిత్రంలో ధనుష్ కన్నా నాలుగేళ్లు వయసులో పెద్ద అయిన మలయాళీ సీనియర్ నటి మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ చిత్రంలో ధనుష్ యువకుడిగా, మధ్య వయస్కుడిగా పలు వేరియషన్స్ లో నటిస్తున్నాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. పల్లెటూరి మొరట వ్యక్తిగా ఊరమాస్ అవతారంలో ధనుష్ అదరగొట్టిపడేసాడు. ఈ ట్రైలర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. 

తలపాగా, పంచె కట్టులో మధ్య వయస్కుడిగా. కోరమీసంతో యువకుడిగా ధనుష్ చేస్తున్న మాస్ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ లో జివి ప్రకాష్ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం కూడా బావుంది. రివేంజ్ నేపథ్యంలో సాగే విలేజ్ డ్రాగా అనిపిస్తోంది ఈ చిత్రం. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.