Asianet News TeluguAsianet News Telugu

రవితేజ 'ధమాకా' ప్రీ - రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

రెండ్రోజుల్లో  ధమాకా’తో  మాస్ మహరాజ్ రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమా పై అంచనాలు పెంచేశారు. తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు కూడా షాకింగ్ గా ఉన్నాయి.
 

Dhamaka pre release bussiness and break even target details!
Author
First Published Dec 21, 2022, 6:10 PM IST

'ధమాకా’తో  మాస్ మహరాజ్ రవితేజ ( Raviteja) మరో హిట్ అందుకునేలా ఉన్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు. రవితేజ - శ్రీలీలా జంటగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్  ‘ధమాకా’ (Dhamaka)  డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. సరిగ్గా రెండ్రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తూ ఆసక్తి పెంచుతున్నారు. 

మరోవైపు చిత్రం ప్రీరిలీజ్ బిజెనెస్ డిటేయిల్స్, బ్రేక్ ఈవెంట్ టార్గెట్ వివరాలు కూడా ఆక్తికరంగా ఉన్నాయి. మీడియం బడ్జెట్ తో  రూపుదిద్దుకున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే రూ.18.30 కోట్లు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఏరియా వైజ్ గా వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం : రూ.5.5 కోట్లు
సీడెడ్ : 2.5 కోట్లు
ఆంధ్ర : 8 కోట్లు
తెలంగాణ - ఏపీ టోటల్ : రూ.16 కోట్లు
కర్ణాటక, ఓవర్సీస్, ఇండియాలోని మిగితా ఏరియాల్లో కలుపుకొని రూ.2.30 కోట్లు

టోటల్ : రూ. 18.30 కోట్లు బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల నివేదిక ఆధారంగా తెలుస్తోంది. దీంతో ‘ధమాకా’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ.19.00 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది. 

ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ కు అదిరిపోయే అప్డేట్స్ అందుతున్నాయి. చిత్రంలో రవితేజ డుయేల్ రోల్ లో నటిస్తుండటం.. హీరోయిన్ గా శ్రీలీలా (Sree Leela) నటిస్తుండటంతో సినిమా ఆసక్తికరంగా మారింది. తనికెళ్ల భరణి, రావు రమేశ్, అలీ, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. డిసెంబర్ 23న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios