Asianet News TeluguAsianet News Telugu

దేవి మెగా బాదుడు!

టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్. సినీ వారసుల రెండు తారలను కవర్ చేసిన ఈ సంగీత దర్శకుడు మొత్తంగా మెగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ బాదేస్తున్నాడు. 

DEVI SRI PRASAD NEW RECORD WITH MEGA FAMILY
Author
Hyderabad, First Published Jan 21, 2019, 2:46 PM IST

టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్. సినీ వారసుల రెండు తారలను కవర్ చేసిన ఈ సంగీత దర్శకుడు మొత్తంగా మెగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ బాదేస్తున్నాడు. ఆర్య సినిమాను ఏ సమయంలో ఒప్పుకున్నాడో గాని ఆ సెకను నుంచి దేవి మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరైపోయాడు. 

ఎంత మంది సంగీత దర్శకులు వస్తున్నా కూడా దేవి పాటలకు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే దక్కుతుంది. మనోడి మ్యూజిక్ కూడా అలానే ఉంటుంది మరి. అయితే ఈ మధ్య వినయ విధేయ రామ తో కొంచెం నీరసపరిచినా కూడా నెక్స్ట్ మెగా మేనల్లుళ్ల సినిమాలకు మ్యూజిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లో కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న వైష్ణవ్ తేజ్ సినిమాకు కూడా దేవినే మ్యూజిక్ అందించనున్నాడు. 

పనిలో పనిగా చిత్ర లహరి సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ కి కూడా ఒకేసారి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఆర్య అనంతరం కుర్ర వయసులో శంకర్ దాదా MBBS ద్వారా మెగాస్టార్ సినిమాను కవర్ చేసి జల్సా తో ఇంకా బాగా క్లిక్ అయ్యాడు. F2 సినిమాతో వరుణ్ వరకు మెగా హీరోలకు సక్సెస్ ట్యూన్స్ ఇచ్చినట్లు గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇప్పటివరకు ఏ ఏడాది గ్యాప్ ఇవ్వలేదు. అంతే కాకుండా మెగా హీరోల సినిమాలకు కూడా పెద్దగా గ్యాప్ లేదు. ఒక్క అల్లు శిరీష్ తో తప్పితే అందరికి మ్యూజిక్ బాదిన ఈ స్టార్ కంపోజర్ శిరిష్ మార్కెట్ సెట్టయితే అతని కోసం కూడా బాణీలు సెట్ చేస్తాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios