అనుష్క కోసం దేవదాసి నాగరత్నమ్మ వెయిటింగ్.. బయోపిక్‌పై సస్పెన్స్ వీడేదెప్పుడు?
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న అనుష్క శెట్టి కోసం ఓ బయోపిక్ స్టోరీ వెయిట్ చేస్తుంది. మరి ఈ సినిమా చేసేందుకు స్వీటీ ఒప్పుకుంటుందా?
అనుష్క(Anushka).. టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అనే ట్యాగ్ వాడటం లేదుగానీ, ఆమె ఆ ట్యాగ్‌కి ఎప్పుడో అర్హురాలు. `అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి`, వంటి సినిమాలతోనే తానేంటో నిరూపించుకుంది. స్టార్ హీరోలకు దీటుగా కలెక్షన్లని రాబట్టి తన సత్తాని చాటుకుంది. అయితే `నిశ్శబ్దం` చిత్రం తర్వాత స్వీటీ గ్యాప్ తీసుకుంది. అనారోగ్య కారణాలతో ఆమె గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది anushka. ఇది స్టాండప్ కామెడీ ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే అనుష్క కోసం పలు స్క్రిప్ట్ లు వెయిటింగ్‌లో ఉన్నాయి. ఆమె `ఎస్` చెప్పడమే ఆలస్యం. చకచకా రెండు మూడు ప్రాజెక్ట్ లు సెట్స్ పైకి వెళ్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలా చాలా కాలంగా వెయిటింగ్‌లో ఉన్న కథ `దేవదాసి నాగరత్నమ్మ` కథ. బెంగుళూరుకి చెందిన దేవదాసి వృత్తిలో రాణించి నాయకురాలిగా ఎదిగిన నాగరత్నమ్మ జీవితం ఆధారంగా తయారు చేసిన కథ ఇది.
వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ కథతో వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత తాను ఈ సినిమా చేయాలని భావిస్తున్నారు. దీన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. అయితే కాస్టింగ్ కుదరకనే దాదాపు మూడు, నాలుగేండ్లుగా ఈ బయోపిక్ కథ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. దేవదాసీ జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కమర్షియల్ గానూ స్ట్రాంగ్ కథ ఇది. అందుకే ఆమె ఈ నాగరత్నమ్మ కథని సినిమాగా తీయాలన్నది సింగీతం ఆలోచన. కథ కూడా రెడీ అయిపోయింది. టాలీవుడ్ లో స్టార్ రచయితగా పేరొందిన బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. డైలాగ్ వర్షన్‌తో సహా స్క్రిప్టు పూర్తయ్యింది.
అయితే ముందుగా ఇందులో మెయిర్‌రోల్ అయిన బెంగళూరు నాగరత్నమ్మ గా సమంతని అనుకున్నారు. ఆమెకు ఈ కథ వినిపించారు కూడా. అయితే ఈ సినిమా చేయాలా, వద్దా? అనే డైలామాలో ఉండిపోయింది సమంత. ఆమె ఇటీవల బోల్డ్ రోల్స్ కూడా ఓకే చెబుతున్నా నేపథ్యంలో సమంత చేసే ఛాన్స్ ఉందని భావించిన నేపథ్యంలో ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఇప్పుడీ కథ స్వీటి అనుష్క శెట్టి వద్దకి వెళ్లిందట. కథ విన్న అనుష్క సైతం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిందట. నాగరత్నమ్మ పాత్ర కాస్త బోల్డ్ గా, అగ్రెసివ్‌గా ఉంటుంది. స్టార్ హీరోయిన్ చేస్తేనే ఆ పాత్ర తెరపై పండుతుంది. అందుకే అనుష్క, సమంతలతో చేయాలని సింగీతం భావిస్తున్నారు. కానీ వారేమో సస్పెన్స్ లో పెట్టారు. మరి అనుష్క అయినా చేస్తుందా? అనేది చూడాలి.