Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాలో దీప్తి వర్సెస్ కౌశల్!

బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో ముగియనుంది. కౌశల్, గీతామాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మొదటి నుండి సేఫ్ గేమ్ ఆడుతూ వస్తోన్న దీప్తి ఫైనల్స్ వరకు చేరుకోవడం విశేషమనే చెప్పాలి. 

Deepthi vs Kaushal in social media
Author
Hyderabad, First Published Sep 24, 2018, 4:16 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో ముగియనుంది. కౌశల్, గీతామాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మొదటి నుండి సేఫ్ గేమ్ ఆడుతూ వస్తోన్న దీప్తి ఫైనల్స్ వరకు చేరుకోవడం విశేషమనే చెప్పాలి. మొదట్లో కౌశల్ విషయంలో ఆమె స్టాండ్ తీసుకోలేదని కౌశల్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడ్డారు. ఆ సమయంలో దీప్తి ఎలిమినేట్ అవుతుందని కూడా అనుకున్నారు.

అయితే కెప్టెన్సీ టాస్క్ లలో ఆమె తన ఫైటింగ్ స్పిరిట్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. టాస్క్ ఓడిపోయినా.. తన బలంతో పురుషులను ఎదుర్కొని నిల్చున్న కారణంగా ఆమెకి మహిళా ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెరిగింది. నాని కూడా శనివారం ఎపిసోడ్ లో దీప్తి గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కౌశల్ ఫ్యాన్స్ దీప్తిని టార్గెట్ చేస్తున్నారు.

ఓట్ల విషయంలో కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ వస్తుండడంతో ఆమె ఓ ఏజెన్సీతో టైఅప్ అయిందని ఆమెకి వస్తోన్న ఓట్లన్నీ ఫేక్ అంటూ కౌశల్ ఆర్మీ ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో కౌశల్ యాంటీ ఫ్యాన్స్.. దీప్తికి మద్దతు తెలుపుతున్నారు. కౌశల్ ఆర్మీ.. దీప్తికి వస్తోన్న ఓట్ల విషయంలో ఇన్వెస్టిగేట్ చేయమని బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేస్తుండగా.. కౌశల్ యాంటీ ఫ్యాన్స్ ముందు కౌశల్ ఆర్మీ సంగతేంటని.. అలా అయితే మొదటి నుండి ఓటింగ్స్ అన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్  రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత రెండు వారాలుగా చూసుకుంటే కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి. కౌశల్ ని హేట్ చేసే వారు ఇప్పుడు దీప్తికి ఓట్లు వేయడం మొదలుపెట్టారు. కౌశల్ ఆర్మీ మహిళా కంటెస్టెంట్స్ మీద కామెంట్స్ చేస్తోన్న తీరు నచ్చని మహిళలు సైతం ఇప్పుడు కౌశల్ ని ఓడించడానికి అన్నట్లుగా దీప్తికి ఓట్లు వేస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో కౌశల్ వర్సెస్ దీప్తి అన్నచందంగా సాగుతోంది. ఇప్పటివరకు కౌశల్ గెలుస్తాడనుకుంటే ఇప్పుడు లైన్ లోకి దీప్తి వచ్చింది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios