Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ లో వీడియో పంపి దర్శకుడికి షాకిచ్చిన సంపూ..!

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  హృదయ కాలేయం కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అసలు విషయంలోకి వస్తే ఇటీవల దర్శకుడికి సంపూ ఊహించని షాక్ ఇచ్చాడట. 

dairector rajesh about sampu actiong in kobbari matta
Author
Hyderabad, First Published Oct 22, 2018, 3:18 PM IST

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమాతో ఎంతగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ తరువాత చాలా సినిమాలు చేసినప్పటికీ క్రేజ్ తగ్గించుకోలేదు గాని హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఆయన హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

హృదయ కాలేయం కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అసలు విషయంలోకి వస్తే ఇటీవల దర్శకుడికి సంపూ ఊహించని షాక్ ఇచ్చాడట. రాజేష్ సంపూ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. సినిమాలో ఇంటర్వెల్ ముందు చెప్పే ఒక డైలాగ్ అందరిని చాలా బాగా ఆకట్టుకుంటుందని అన్నాడు. ఆ డైలాగ్ కోసం దర్శకుడు చాలా కష్టపడ్డట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. 

కొబ్బరిమట్ట సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నాక.. ఇంటర్వెల్‌కి ముందు ఏదైనా హై పాయింట్ ఉంటే బాగుంటుందనుకుని.. ఒక డైలాగ్ రాద్దామని డిసైడ్ అయ్యాను. మూడు రోజుల స్ట్రగుల్ తర్వాత ఒక ఐడియా వచ్చింది. నా ఒక్కడి వల్ల కాదనుకుని రఘురామ్ శ్రీపాద సాయం అడిగాను. 8 గంటల శబ్దరత్నాకర మథనం తర్వాత ఒక డైలాగ్ పుట్టింది. రాసిన మాకే నోరు తిరగలేదు. సరిగ్గా 10 రోజుల క్రితం సంపూకి పంపాను. నా వల్ల కాదన్నాడు. మాట్లాడటం మానేశా ఒక రెండు రోజులు.   

సడన్‌గా పొద్దునే వాట్సాప్‌లో వీడియో వచ్చింది. మూడు నిమిషాల ఆరు సెకన్ల సింగ్ షాట్.. ఊపిరి తీసుకోకుండా చెప్పేశాడు. నోరు తెరుచుకుని అలా చూస్తుండిపోయా. ఎక్కడి హృదయకాలేయం సంపూ... ఎక్కడి ఈ సంపూ.. 

ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అనంతరం సంపూర్ణేష్‌ బాబును ఒక నటుడిగా ప్రేమిస్తారు. మూడు నిమిషాల 10 సెకన్ల డైలాగ్.. ఒక్క గుక్కలో చెప్పాడని తెలుపుతూ.. థాంక్యూ రఘురాం శ్రీపాద నీవల్లే ఇది సాధ్యమైంది’’ అని రాజేష్ తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios