బిగ్‌బాస్‌ హౌజ్‌లో 67వ రోజు జరిగిన ఎపిసోడ్‌లో సభ్యులు తమ జీవితంలోని ఇంత వరకు ఎవరికీ చెప్పని సీక్రెట్స్ బయటపెట్టాలని, అందుకు ప్రతిఫలంగా తమ ఆప్తుల నుంచి సందేశాలను పొందాలని చెప్పాడు బిగ్‌బాస్‌. సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌ ఈ లెటర్స్ ని వారు చెప్పిన సీక్రెట్స్ కరెక్టా? కాదా? తేల్చుకుని ఇవ్వాల్సి ఉంటుంది.

ఇందులో సోహైల్‌ చెప్పినది ఫన్నీగా అనిపించగా, అభిజిత్‌ చెప్పింది పెద్దగా అర్థమే కాలేదు. ఇక మెహబూబ్‌ ఓ మోస్తారు విషయం చెప్పాడు. మోనాల్‌ కూడా తన ఎడ్యూకేషన్‌ సీక్రెట్‌ని చెప్పింది. అయితే లాస్య చెప్పినది ఆసక్తిరేకెత్తించింది. తన భర్త తనకంటే ఏడాది చిన్నా అని చెప్పి షాక్‌ ఇచ్చింది. అదే సమయంలో హారిక సైతం తాను నాలుగున్నరేళ్ళు ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని చెప్పి షాక్‌ ఇచ్చింది. 

ఇక అవినాష్‌, అరియానాల సీక్రెట్స్ ఎమోషనల్‌కి గురి చేశాయి. అరియానా ఓ రోజు అర్థరాత్రి ప్రయాణించాల్సి ఉందని, శంకర్‌పల్లికి వెళ్లాల్సి ఉందని, కారులో బయలు దేరినట్టు తెలిపింది. ముందు ఓ వెహికల్‌ సడెన్‌గా రావడంతో తమ కారు ప్రమాదానికి గురైందని, దాదాపు కిలో మీటర్‌ దూరం వెళ్ళి ఓ కరెంట్‌ స్థంభానికి గుద్దుకుందని, ఆ రోజు తమ ప్రాణాలు పోయేవని, ఈపాటికి మేం చనిపోయే ఏడాది అయ్యేదని, ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదని పేర్కొంది. 

మొత్తానికి బతికి బయటపడ్డామని ఇప్పుడు ఈ బిగ్‌బాస్‌లో ఉన్నానని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టించింది. అయితే అరియానా చెప్పినది సీక్రెట్ కాదని, దీనికి సంబంధించిన విషయం కాదని చెప్పి అఖిల్‌ ఆమెకి వచ్చిన లెటర్‌ని కట్‌ చేయించి పంపించాడు. దీంతో లెటర్‌ చూసుకున్న అరియానా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. గత కొన్ని రోజులుగా తన ఫ్యామిలీని బాగా మిస్‌ అవుతుంది. ఇప్పుడు కనీసం లెటర్‌ చదువుకుని ఆనందించాల్సింది. కానీ అఖిల్‌ దాన్ని కట్‌ చేయించాడు. 

మరోవైపు అవినాష్‌ విషయంలోనూ అదే చేశాడు. అవినాష్‌ సినిమాల్లోకి రావాలని.. సినిమాలపై పిచ్చితో ఆడిషన్‌కి వెళ్ళినప్పుడు ఒకరు 85 రూపాయలు అడిగారని, అది ఇస్తే సినిమాలో మెయిన్‌ క్యారెక్టర్‌ ఇస్తామని చెప్పి డబ్బు తీసుకున్నారని, ఆ మొత్తాన్ని వడ్డీకి అప్పు చేసి ఆ నిర్మాతలకు చెల్లించానని, కానీ రెండు రోజులు ఇక్కడే ఉండాలని చెప్పి మోసం చేశారని తెలిపాడు. అయితే ఈ విషయం తనకు తెలుసు అని అఖిల్‌.. అవినాష్‌కి వచ్చిన లెటర్‌ని కట్‌ చేసి ఇచ్చాడు. అయితే అందులో పెళ్లి సంబంధాలు వస్తున్నాయని తెలిసింది.

ఇదిలా ఉంటే అరియానా, అవినాష్‌కి సంబంధించిన సన్నివేశాలు ఇటీవల ఎమోషనల్‌కి గురి చేశాయి. పైగా చాలా రోజుల తర్వాత తమ ఇంటి వాళ్ళ నుంచి వచ్చిన లెటర్స్ ఇలా కట్‌ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అఖిల్‌ తొందరపడ్డాడని, ఆయన సరైన జడ్జ్ మెంట్‌ కాదని విమర్శిస్తున్నారు. మరోవైపు అభిజిత్‌పై కూడా ఆయన కామెంట్లు చేయడంతో అభిజిత్‌ ఫ్యాన్స్ కూడా అఖిల్‌పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి సీక్రెట్‌ రూమ్‌లోకి వెళ్ళి మంచి మార్కులు సంపాదించిన అఖిల్‌.. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు.