తమిళ స్టార్ హీరో రజినీకాంత్ ని కలవాలనుందని క్రికెటర్ బ్రావో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

తమిళ స్టార్ హీరో రజినీకాంత్ ని కలవాలనుందని క్రికెటర్ బ్రావో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం ఆడుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చాలా కాలంగా ఆయన చెన్నై జట్టులో ఆడుతున్న కారణంగా అక్కడి కల్చర్, ఆహార పదార్ధాలు ఎంతగానో నచ్చుతున్నాయని చెప్పారు. ఇలా ఉండగా.. నటుడు రజినీకాంత్ ని కలవాలనుందని బ్రావో వెల్లడించారు.

ఈ క్రమంలో ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ గురించి విన్నానని, కానీ ఆయన నటించిన చిత్రాలు చూడలేదని.. త్వరలోనే చూస్తానని.. రజినీకాంత్ ని కలుసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీలలో కూడా చాలా మంది ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు బ్రావో కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు.