Asianet News TeluguAsianet News Telugu

నిఖిల్ ‘కార్తికేయ 2’ నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ కు సిద్ధంగా ఫస్ట్ ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తీకేయ 2’. ఈ మూవీ నుంచి తాజాగా క్రేజీ అనౌన్స్ మెంట్ అందింది. చిత్ర ఫస్ట్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నట్టు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.  
 

Crazy update from Nikhil Karthikeya 2 movie, First trailer ready for release
Author
Hyderabad, First Published Jun 24, 2022, 1:39 PM IST

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కార్తీకేయ 2’. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ భాగం తుదిదశకు చేరుకుంది. కార్తికేయ 2ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 22న విడుద‌ల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్రం క్రేజీ అప్డేట్ అందింది. ఇటీవల Karthikeya 2 నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రిలీజ్ కు నెలరోజులే సమయం ఉండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వరుసగా అప్డేట్స్ అందిస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా క్రేజీ అప్టేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు  అనౌన్స్ చేశారు. కార్తికేయ2 మొదటి విజువల్ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5:40 గంటలకు AMB సినిమాహాళ్లలో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ నే హీరో గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ మూవీతో పాటు ప్రదర్శించనున్నారు.  దీంతో  నిఖిల్  అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 
శ్రీకృష్టుడి చ‌రిత్రకు  సంబంధించిన ఆనవాళ్లు ద్వారక, ద్వాప‌ర యుగంలో ఏర్పడ్డాయి. ఇప్ప‌టికీ ఆ లింక్ లోనే కార్తికేయ‌ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్ర‌యాణమే కార్తీకేయ 2.  శ్రీ కృష్ణుడిని అన్వేషిస్తూ డాక్ట‌ర్ కార్తికేయ చ‌రిత్ర‌లోకి ప్రవేశిస్తాడు. హీరోహీరోయిన్లుగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ పలు పాత్రలను పోషిస్తున్నారు. నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. జూలై 22న ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు షూడ్యూల్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios