Asianet News TeluguAsianet News Telugu

క్రేజీ హీరో ఫ్యామిలీ వెకేషన్.. ప్రొడ్యూసర్ అకౌంట్ లో..?

టాలీవుడ్ లో యంగ్ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు ఓ కుర్రాడు. అతడికి యూత్ లో మామూలు ఫాలోయింగ్ లేదు. 

Crazy Hero's Family Enjoying In Producer's Account
Author
Hyderabad, First Published Jun 5, 2019, 12:42 PM IST

టాలీవుడ్ లో యంగ్ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు ఓ కుర్రాడు. అతడికి యూత్ లో మామూలు ఫాలోయింగ్ లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన ఈ కుర్ర హీరో రీసెంట్ గా తన ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి విదేశాలకు ట్రిప్ కి వెళ్లాడు.

నిజానికి అతడు తన కొత్త సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లాడు. షూటింగ్ మొదలుకావడానికి వారం రోజులు ముందుగానే విదేశాలకు చేరుకున్నాడు. ఈ గ్యాప్ లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అదంతా బాగానే ఉంది కానీ.. ఈ హీరోగారి హాలిడేకి కావలసినంత ఖర్చు మొత్తం తన కొత్త నిర్మాత అకౌంట్ వేసినట్లు సమాచారం.

నిజానికి ఈ హీరో ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నాడు. ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్  తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఈ ట్రిప్ కి అయ్యే ఖర్చు తనే పెట్టుకోవచ్చు కానీ నిర్మాత అకౌంట్ లో వేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

స్టార్ హీరోలు సైతం తమ రెమ్యునరేషన్ మినహా మిగిలిన ఖర్చులు నిర్మాతల అకౌంట్ వేయడానికి ఆలోచిస్తారు కానీ ఈ కుర్రహీరో మాత్రం తనకు కావాల్సింది డిమాండ్ చేసుకొని మరీ తీసుకుంటున్నాడు. తనకున్న క్రేజ్ అలాంటిది మరి.. పాపం ఆ నిర్మాత మాత్రం ఏం చేస్తాడు.. ఇచ్చిన బిల్లులు కట్టడం తప్ప.  

Follow Us:
Download App:
  • android
  • ios