క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రానా నాయుడు తెరకెక్కనుండగా, రానా, వెంకటేష్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ సిరీస్ కి సంబంధించి రానా, వెంకటేష్ లుక్ కూడా విడుదల చేశారు.

ఓటిటి వేదికగా సూపర్ కాంబినేషన్ సెట్ అయ్యింది. టాలీవుడ్ బాబాయ్ అబ్బాయ్ విక్టరీ వెంకటేష్(Venakatesh), రానా(Rana) దగ్గుబాటి కలిసి స్క్రీన్ పంచుకోవడానికి సిద్ధమయ్యారు. దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్ రానా నాయుడు పేరుతో వెబ్ సిరీస్ ప్రకటించిగా, రానా, వెంకటేష్ నటించనున్నారు. హాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ రే డొనోవన్ కి ఇది అధికారిక రీమేక్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రానా నాయుడు తెరకెక్కనుండగా, రానా, వెంకటేష్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ సిరీస్ కి సంబంధించి రానా, వెంకటేష్ లుక్ కూడా విడుదల చేశారు. ఇద్దరి లుక్ ఆసక్తి రేపుతుండగా, ముఖ్యంగా వైట్ హెయిర్ కలిగిన వెంకీ లుక్ అంచనాలు పెంచేసింది. 

Scroll to load tweet…


కరణ్ అన్షుమన్, ఎస్ ఎస్ వర్మ ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటనపై రానా దగ్గుబాటి, వెంకటేష్ స్పందించారు. పసివాడిగా నేను ఎరిగిన రానా మంచి నటుడిగా మారడం చూశాను. రానా నాయుడులో రానా మరింతగా అలరిస్తాడని.. వెంకటేష్ ట్వీట్ చేశారు. బాబాయ్ వెంకటేష్ తో స్క్రీన్ పంచుకోవాలని అనేది నా చిరకాల కోరిక, అది ఇప్పుడు నెరవేరిందని రానా సంతోషం వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…