'అయోధ్యలో అర్జునుడు' గా మహేష్... ఇక బాక్సాఫీస్ బద్దలే!
మహేష్ లేటెస్ట్ మూవీ టైటిల్ అదిరిపోయింది. టాలీవుడ్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు త్రివిక్రమ్ అదిరిపోయే టైటిల్ సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దర్శకుడు త్రివిక్రమ్ మూవీ టైటిల్స్ లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇక కొన్నాళ్లుగా ఆయన 'అ' సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. టైటిల్ మొదటి అక్షరం 'అ' తో మొదలయ్యేలా టైటిల్ సెట్ చేస్తున్నాడు. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో ఈ కోవకు చెందిన టైటిల్స్ అని చెప్పొచ్చు. మహేష్ కోసం ఆయన ఇదే తరహా టైటిల్ సెట్ చేశాడట. మాస్ అప్పీల్ తో పాటు క్యాచీగా ఉండేలా 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ నిర్ణయించాడట. మహేష్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే అంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
అయోధ్యలో అర్జునుడు టైటిల్ పట్ల మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. టైటిల్ అద్బుతంగా ఉంది, ఇక బాక్సాఫీస్ బద్దలే అంటున్నారు. మరి ప్రచారమవుతున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కానీ టాలీవుడ్ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి . అందులోనూ దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేష్ వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ ఓ ఉన్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి పని చేస్తున్నారు. గతంలో మహేష్ హీరోగా త్రివిక్రమ్ అతడు, ఖలేజా చిత్రాలు తెరకెక్కించారు. అతడు ఆల్ టైం తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ మూవీగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. 2023 సమ్మర్ కానుకగా మహేష్ 28వ చిత్రం విడుదల కానుంది. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో రాజమౌళి మూవీ షూటింగ్ మొదలుకానుంది.