రవితేజ హీరోగా నటించిన `క్రాక్‌` చిత్రానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఫైనాన్షియల్‌ ఇష్యూస్‌ అన్నీ క్లీయర్‌ అయ్యాయి. దీంతో ఈ రోజు విడుదలకు రెడీ అయ్యింది. శనివారం సాయంత్రం ఫస్ట్ షో నుంచి ఈ సినిమాని ప్రదర్శించనున్నట్టు దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. `అన్ని సమస్యలు తీరిపోయాయి. `క్రాక్‌` సినిమాని ఈ రోజు ఫస్ట్ షోకి మీ దగ్గరలోని థియేటర్లలో వీక్షించండి` అని తెలిపారు. దీంతో చిత్ర బృందంతోపాటు రవితేజ సైతం విడుదలపై ఊపిరి పీల్చుకున్నారు. 

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ, శృతి హాసన్‌ జంటగా రూపొందిన యాక్షన్‌ ఎంటర్టైనర్‌ `క్రాక్‌`. ఠాగూర్‌ మధు ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9(ఈ రోజు) సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాతకి గత చిత్రాలకు సంబంధించి ఉన్న ఆర్థిక లావాదేవీల సమస్యలు ఇప్పుడు ముందుకు రావడంతో `క్రాక్‌` చిత్రాన్ని నిలిపివేశారు. గత సినిమాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు, చెన్నైకి చెందిన వారు కోర్ట్ కి వెళ్లడంతో సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ప్రాబ్లెమ్స్ సాల్వ్ కావడంతో సినిమాని ఫస్ట్ షో నుంచి విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. లేట్‌గా విడుదల కానున్న సినిమాకి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే చాలా థియేటర్లకి అగ్రిమెంట్‌ పేపర్స్ అందలేదు. కౌంటర్స్ ఓపెన్‌ కావడం లేదు. దీంతో ఫస్ట్ షో పడేలా లేదు. మెయిన్‌ సెంటర్స్ లో సెకండ్‌ షో పడే ఛాన్స్ ఉంది.