దాదాపు పదేళ్ల క్రితం తొలిసారి తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది

‘కలర్స్’ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన స్వాతి.. అక్కడి నుంచి వెండితెరవైపు అడుగులు వేసింది. దాదాపు పదేళ్ల క్రితం తొలిసారి తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత డేంజర్, అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోల్కొండ హైస్కూల్‌, క‌ల‌వ‌ర‌మాయె మ‌దిలో, స్వామి రారా, కార్తికేయ‌ తదితర తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తోంది.

కాగా ఇప్పుడు కలర్స్ స్వాతి పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఈ విషయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ శ్రీ తాజాగా తన ట్విటర్‌లో వెల్లడించారు. ఆగస్టు 30వ తేదీ రాత్రి స్వాతి వివాహం హైదరాబాద్‌లో జరగనుందని తెలిపారు. సెప్టెంబర్ రెండో తేదీన కోచిలో రిసెప్షన్ ఉంటుందని సమాచారం. ఆమె పెళ్లిచేసుకోబోయే వరుడు పేరు వికాస్.. మలేషియా ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా పనిచేస్తాడని.. ఇండోనేషియాలోని జకార్తాలో నివాసం ఉంటున్న‌ట్లు చెప్పారు. వీరిది లవ్ కమ్ పెద్దలు కుదిర్చిన వివాహమని సమాచారం.