Asianet News TeluguAsianet News Telugu

#Kalki2898AD:షాక్ ..'కల్కి' క్లైమాక్స్ లో, ఇంతమంది స్టార్స్?

 ఇండియన్ తెరపై ఎవరూ ఇప్పటిదాకా చూడని విధంగా ప్లాన్ చేస్తున్నారట. పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఒకేసారి కనపడబోతున్నారు. 

Climax of Prabhas Kalki 2898 AD  is said to be a grand spectacle jsp
Author
First Published Feb 5, 2024, 6:30 AM IST


ఈ సమ్మర్‌ సినిమాల పరంగా దుమ్ము రేపేలా ఉంది. ఈ వేసవిలో రానున్న పాన్ ఇండియా సినిమాల్లో కల్కి ఒక్కటే పెద్ద సినిమా. సలార్ వంటి హిట్ తర్వాత ప్రభాస్ నుంచి  వస్తున్న కల్కి పై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా… కమల్ హసన్ విలన్‌గా నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

 మే 9న కల్కి 2898 ఏడి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ కల్కి సెట్స్‌లోకి జాయిన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో   కల్కి  క్లైమాక్స్ కు సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేమిటంటే..క్లైమాక్స్ చాలా గ్రాండ్ గా ఎవరూ ఊహించని విధంగా ఉండబోతోందిట. ఇండియన్ తెరపై ఎవరూ ఇప్పటిదాకా చూడని విధంగా ప్లాన్ చేస్తున్నారట. పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఒకేసారి కనపడబోతున్నారు. వచ్చే వారమే క్లైమాక్స్ షూట్ జరగబోతోంది. 

క్లైమాక్స్ లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకోని, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, ఇలా ఇంకా చాలా మంది స్టార్స్ కనపడబోతున్నారు. కల్కి రెండు పార్ట్ లుగా రాబోతోంది. మొదటి పార్ట్ చివర్లో కమల్ ఎంట్రీ ఇస్తారు. కమల్ విశ్వరూపంతో క్లైమాక్స్ దద్దరిల్లిపోతుందంటున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే స్దాయిలో ఈ క్లైమాక్స్ ని డిజైన్ చేసారు.

 'కల్కి 2898 AD'  ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ సినిమా గురించి చర్చలు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో మొదలయ్యాయి.  అభిమానులు ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా పురాణాలను టచ్ చేస్తూ తెరకెక్కుతోందని వినిపిస్తోంది. ప్రభాస్ కల్కి అవతారంలో కనిపించనున్నాడు కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ ఏకంగా ఐదు విభిన్న పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. శ్రీమహావిష్ణువు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, కల్కి… ఇలా ఐదు పాత్రల్లో ప్రభాస్ కనిపించనున్నట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక   ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ VFX నాణ్యత కోసం సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయబడిన విషయం తెలిసేందే. అందుకుగాను ఈ మూవీ టీం..ప్రేక్షకులకు సాధ్యమైనంత VFX విజువల్ ను   అందించడానికి మేకర్స్ మరింత సమయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios