ఈ స్క్రిప్టుపై చాలా కాలంగా ఆయన వర్క్ చేస్తున్నారు. అయితే తను పూర్తి చేయలేకపోతన్నానంటూ గతంలో ఇంటర్వూలలో చెప్పారు. 


ప్రఖ్యాత  హాలీవుడ్ దర్శకుడు 'క్రిస్టోఫర్ నోలన్'కి సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన తన సినిమాలను సైన్స్‌తో, ఆధునిక విజ్ఞాన ఆలోచనలతో తెరకెక్కిస్తూంటారు. ఆ సినిమాల్లో ఏదో ఒక కొత్త అంశం ఎప్పుడూ తొంగి చూస్తూంటుంది. ఆ క్రమంలో  రెండో ప్రపంచ యుద్దానికి ముగింపు పలికిన ఒక సంఘటనను బేస్ చేసుకుని  క్రిస్టోఫర్ తెరకెక్కించిన 'ఓపెన్‌హోమర్' సినిమా ఏకంగా ఆస్కార్ నే తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి ఆయన తదుపరి చిత్రం ఏమిటనేదానిపై పడింది.

ఇంటర్నేషనల్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు నోలన్ తదుపరి చిత్రం ఓ రీమేక్ . 1960లో వచ్చిన టీవీ సీరిస్ ‘THE PRISONER’ రీమేక్ గా తన సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ స్క్రిప్టుపై చాలా కాలంగా ఆయన వర్క్ చేస్తున్నారు. అయితే తను పూర్తి చేయలేకపోతన్నానంటూ గతంలో ఇంటర్వూలలో చెప్పారు. 

 ‘THE PRISONER’కథ ఓ గూఢచారి(ఏజెంట్) చుట్టూ తిరుగుతుంది. అతను తన జాబ్ నుంచి రిజైన్ చేస్తాడు. కానీ అతను కిడ్నాప్ కు గురి అవుతాడు. ఓ మిస్టీరియస్ సీ సైడ్ గ్రామం కు తీసుకురాబడతాడు. అక్కడ  నిరంతర నిఘాలో ఉంటుంది. అలాగే చుట్టూ ఖైదీలతో నిండిపోయి ఉంటుంది. ఎవరు తనను కిడ్నాప్ చేసారనేది అంతు పట్టని ఓ ప్రశ్నగా ఉండిపోతుంది. అతని మానసిక స్దితి ఏమిటి...ఎలా తప్పించుకున్నాడనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 
 
గతంలో నోలన్ డైరక్ట్ చేసిన మెమెంటో, ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, టెనెట్ వంటి సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి.   ‘ఒప్పెన్‌హెయిమర్’అయితే ఏకంగా ఆస్కార్ తెచ్చిపెట్టింది. దాంతో నోలన్ ఓ కథను ఎంపిక చేసారంటే అందులో ఏదో స్పెషాలిటీ ఉన్నట్లే లెక్క. మొదటి  నుంచి తన దారి అదే.  కాలంతో, కలలనే కాన్సెప్టుగా పెట్టుకుని సినిమాలు తీయటం నోలన్‌కు చాలా ఇష్టం.