నేచురల్ స్టార్ నాని నటించిన 'గ్యాంగ్ లీడర్ ' సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైం హిట్స్ లో 'గ్యాంగ్ లీడర్' సినిమా ఒకటి. ఈ సినిమాని రామ్ చరణ్ రీమేక్ చేస్తేబాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

చిరు కూడా చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ నాని తీసేసుకున్నాడు. నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా తయారై రిలీజ్ కి సిద్ధంగా ఉంది. చిరు 'గ్యాంగ్ లీడర్' కి ఈ 'గ్యాంగ్ లీడర్'కి ఏ మాత్రం సంబంధం లేదు. 

కానీ ఆ సినిమా తాలుకూ కొన్ని రిఫరెన్స్ లు మాత్రం ఈ సినిమాలో కనిపించబోతున్నాయి. ఈ విషయాన్ని నాని సైతం ఒప్పుకున్నాడు. 'గ్యాంగ్ లీడర్' సినిమా షాట్ ఒకటి ఈ సినిమా వాడినట్లు.. ఆ సీన్ అభిమానులకు బాగా నచ్చుతుందని నాని చెప్పుకొచ్చాడు. అయితే అది కావాలని వాడిన షాట్ కాదని.. కథకు అవసరం కాబట్టే వాడినట్లు తెలిపారు. అప్పట్లో 'గ్యాంగ్ లీడర్' సినిమాలో చిరంజీవి పూల చొక్కాలు వేసుకొని కనిపించారు.

ఆ సమయంలో ఆ షర్ట్ లకు బాగా డిమాండ్ వచ్చింది. ఈ సినిమాలో కూడా నాని షర్ట్ లన్నీ ఒక థీమ్ ప్రకారం డిజైన్ చేసినవే.. ఈ సినిమాలో నాని నవలా రచయితగా  కనిపించనున్నాడు. ఆయన సరసన హీరోయిన్ గా ప్రియాంక ఆరుళ్ మోహన్ కనిపించనుంది.