Asianet News TeluguAsianet News Telugu

#Vishwambhara: ‘విశ్వంభర' లో చిరు క్యారక్టర్ ఇదే, సినిమా టార్గెట్ వాళ్లే

చిరంజీవి గతంలో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి చిత్రాలకు మించే స్థాయిలో ఈ సోషియోఫాంటసీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని సమాచారం.

Chiranjeevi Turns As Dorababu for Vishwambhara jsp
Author
First Published Jan 28, 2024, 1:40 PM IST


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 156వ (Mega 156) చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ‘బింబిసార’తో మెప్పించిన యువ దర్శకుడు వశిష్ట ఈ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఒక  భిన్నమైన అడ్వెంచర్‌ ఫాంటసీ సినిమా. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఫైనల్ చేసారు. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఇందులో చిరంజీవి పాత్ర పేరు భీమవరం దొరబాబు అని సమాచారం. భీమవరం నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుందని, ఇందులో చిరంజీవి లుక్, గెటప్ చాలా డిఫరెంట్ ఉంటాయని, ఆ పాత్రలో మంచి ఎంటర్టైన్మెంట్  ఉంటుదని తెలుస్తోంది. 

ఈ సినిమాలో చిరంజీవి గోదావరి యాసను పండించనున్నారు. ఇక దొరబాబు పాత్ర నవ్వులుని పంచుతూనే మరో కొత్త ఊహ ప్రపంచానికి తీసుకెళుతుందని, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం.  ఇందులో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని వినికిడి. ఈ కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ సెకండాఫ్ లో వచ్చి కథను మలుపు తిప్పుతుందిట. చిరంజీవి గతంలో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి చిత్రాలకు మించే స్థాయిలో ఈ సోషియోఫాంటసీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని సమాచారం.

    తాను ఫిబ్రవరి 1 నుండి 'విశ్వంభర' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా చిరంజీవి చెప్పారు.  సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది. అలాగే  కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివీల్ చేస్తూ టీజర్ ఒకటి విడుదల చేశారు, అది వైరల్ అయింది కూడా. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఓవర్ సీస్ రైట్స్ ని రికార్డ్ ప్రైస్ కు అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది.  ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్.  ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో VFX వర్క్స్ చాలా ఉన్నాయి. విశ్వంభర విజువల్ వండర్ లా ఉండబోతుంది.   ఈ చిత్రం కథ మూడు లోకాల్లో తిరుగుతుందిట. అందుకే ముల్లోకాల వీరుడు అనే టైటిల్ మొదట అనుకున్నారట. అయితే ఆ టైటిల్ బాగున్నా ఏదో డబ్బింగ్ సినిమా టైటిల్లా ఉందని  భావించారట. దాంతో  విశ్వంభర అనే టైటిల్‌ ని పెడదామనే నిర్ణయానికి వచ్చినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.  విశ్వంభర వినటానికి  బాగుందని, ఈ కథకు, చిరు ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారట.  దసరా సందర్భంగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు క్లాప్ కొట్టారు. ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ దాదాపుగా రెండు వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.

Follow Us:
Download App:
  • android
  • ios