బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. రన్బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో చిరంజీవి భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దర్శకుడు అయాన్ ముఖర్జీ సోసియో ఫాంటసీ, మైథలాజికల్ కాన్సెప్ట్ తో బ్రహ్మాస్త్ర తెరకెక్కిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. జూన్ 15న బ్రహ్మాస్త్ర ట్రైలర్ భారీగా విడుదల చేయనున్నారు. ఇటీవల హీరో రన్బీర్ కపూర్ వైజాగ్ రావడం జరిగింది. రాజమౌళితో పాటు ఆయన బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వహించారు.
సౌత్ ఇండియా నాలుగు భాషల్లో రాజమౌళి బ్రహ్మాస్త్ర (Brahmastra)చిత్రానికి సమర్పకుడిగా ఉన్నారు.. తాజా సమాచారం ప్రకారం రాజమౌళితో పాటు చిరంజీవి బ్రహ్మాస్త్ర చిత్రంలో భాగం కానున్నారట. ఇటీవల దర్శకుడు అయాన్ ముఖర్జీ హైదరాబాద్ లో చిరంజీవిని కలిశారు. బ్రహ్మాస్త్ర విషయమై ఇద్దరి మధ్య చర్చలు జరుగగా.. అవి సఫలీకృతం అయ్యాయంటున్నారు. అయితే చిరంజీవి రాజమౌళితో పాటు బ్రహ్మాస్త్ర సమర్పకుడిగా ఉంటారా? కేవలం ప్రమోషన్స్ లో భాగం అవుతారా? ఈ చిత్రంలో ఆయన ఇన్వాల్మెంట్ ఏమిటనే విషయంలో క్లారిటీ లేదు.
కాగా బ్రహ్మాస్త్ర మూవీలో నాగార్జున(Nagarjuna) ఓ కీలక రోల్ చేయడం విశేషం. ఇటీవల ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. అలాగే అమితాబ్ ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధరమ్ ప్రొడక్షన్స్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నారు.
మరోవైపు చిరంజీవి (Chiranjeevi) హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. అలాగే దర్శకుడు బాబీతో మెగా 154 తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. మలయాళ చిత్రం లూసిఫర్ కి ఇది అధికారిక రీమేక్. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఆయనపై ఓ ఫైట్, సాంగ్ కూడా షూట్ చేశారట. చిరంజీవి అప్ కమింగ్ చిత్రాలపై భారీ హైప్ నెలకొని ఉంది. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా చిరంజీవి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
