విశ్వంభర కోసం చిరంజీవి మేకోవర్... లుక్ పై హైప్ పెంచేశారే, వీడియో వైరల్!


మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం చిరంజీవి మేకోవర్ అవుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. 
 

chiranjeevi starts make over for vishwambhara movie ksr

ఒక వయసు వచ్చాక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం మాట వినదు. ఏళ్ళు పెరిగే కొద్దీ  షేప్ అవుట్ అవుతుంది. 68 ఏళ్ల చిరంజీవి కొన్నాళ్లుగా లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ ఆయన షేప్ అవుట్ బాడీ పై ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో వాల్తేరు వీరయ్య లో చిరంజీవి యంగ్ గా కనిపించారు. శ్రీను వైట్ల తెరకెక్కించిన అందరివాడు మూవీ టైముకే చిరంజీవి బరువు పెరిగి మునుపటి లుక్ కోల్పోయారు. 

అయితే విశ్వంభర కోసం ఆయన యంగ్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు కసరత్తు మొదలుపెట్టారు. జిమ్ లో అడుగుపెట్టిన చిరంజీవి కఠిన వ్యాయామం చేస్తున్నారు. పూర్తి ఫిట్నెస్ సాధించేందుకే చెమటలు చిందిస్తున్నాడు. కథలో భాగంగా చిరంజీవి బరువు తగ్గి ఫిట్ గా కనిపించాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

విశ్వంభర సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న చిత్రం. చిరంజీవి పాత్రలో భిన్న షేడ్స్ ఉండే అవకాశం కలదు. చిరంజీవి మూడు లోకాల్లో సంచరిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే చిరంజీవి ఈ సాహసానికి ఒడిగట్టారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఈ వయసులో గంటల తరబడి జిమ్ చేయడం ప్రమాదం అని చెప్పాలి. పట్టుదలకు మారుపేరు అయిన చిరంజీవి ఈ ఛాలెంజ్ స్వీకరించాడు. 

ఈ క్రమంలో విశ్వంభరలో చిరంజీవి లుక్ పై అప్పుడే ఆసక్తి పెరిగిపోయింది. కాగా చిరంజీవి త్వరలో మరో మూవీ ప్రకటించనున్నాడట. కూతురు సుస్మిత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పని చేస్తున్న దర్శకులలో ఒకరు ఈ చిత్ర డైరెక్టర్ అంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios