అమీర్ ఖాన్‌పై ప్రశంసలు కురిపించారు చిరంజీవి. ఆయనలాంటి నటుడు ఇండియాలో మరెవ్వరూ లేరని, పాత్రకోసం తన బాడీని మౌల్డ్ చేసుకునే ఏకైక నటుడు అమీర్ ఖాన్ అన్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan)పై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఆయనలాంటి నటుడు ఇండియాలో మరెవ్వరూ లేరని, అనేక ప్రయోగాలు చేసే నటుడు, పాత్రకోసం తన బాడీని మౌల్డ్ చేసుకునే ఏకైక నటుడు అమీర్ ఖాన్ అన్నారు. ఆయన్ని హాలీవుడ్ ఆస్కార్ నటుడు టామ్ హంక్స్ తో పోల్చారు. ఇండియాకి టామ్ హంక్స్(Tom Hanks) లాంటి నటుడన్నారు చిరంజీవి. అమీర్ ఖాన్, నాగచైతన్య, కరీనా కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ `లాల్ సింగ్ చద్దా`(Lal Singh Chaddha). ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాని చిరంజీవి సమర్పించడం విశేషం. ఆయన సమర్పణలో తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ అమీర్ ఖాన్‌పై ప్రశంసలతో ముంచెత్తాడు. మూడేళ్ల క్రితం జపాన్ ఎయిర్ పోర్ట్ కలిశారని, ఆ సందర్భంగా ఆరుగంటలపాటు తామిద్దరం కలిసి జర్నీ చేశామన్నారు.
ఆ టైమ్‌లో తాను ఇలా హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్`ని రీమేక్ చేయబోతున్నట్టు చెప్పారు. అప్పుడు తాను ఎంతో ఆనందానికి గురయ్యానని, ఆ సినిమా తనకు ఎంతో ఇష్టమని, అద్భుతమైన సినిమాని అమీర్ చేస్తున్నారనంటే చాలా సంతోషమేసిందని చెప్పారు. అయితే ఈ టైమ్‌లో ఆ సినిమా చేయడం అవసరమా అనే సందేహం కలిగింది. కానీ దాన్ని చేసి చూపించారు అమీర్. పాత్ర కోసం బాడీని ట్రాన్స్ ఫామ్ చేయడంలో అమీర్‌కి ఎవ్వరూ సాటి రారని చెప్పారు చిరంజీవి.
అమీర్ బాడీ లాంగ్వేజ్, ఆంగీకం, గెటప్, ప్రవర్తన, పాత్రని పోషించే విధానం కానివ్వండి, సినిమా సినిమాకి చాలా తేడాని చూపిస్తుంటారు.యూత్‌లో చాక్లెట్ బాయ్‌లా, లవర్ బాయ్‌లా ఉండేవారు. `మంగళ్ పాండే`లో మీసాలు పెంచి కనిపించారు. `దంగల్` చూస్తే ఒకలా ఉంటుంది. `పీకే`లో ఫన్నీగా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు.`లగాన్`లో ఓ పల్లెటూరి అబ్బాయిగా, రస్టిక్ పాత్రలో ఒదిగిపోయారని చెప్పారు చిరు. ఎప్పటికప్పుడు ట్రాన్స్ ఫామ్ అవుతూ వస్తుంటారు. ఇలాంటి తపన, హార్డ్ వర్క్ చేసే నటులెవరైనా ఉన్నారంటే ఇండియాలో ఎవరూ లేరు. అది ఒకేఒక్కరు అమీర్ ఖాన్ అని చెప్పారు చిరంజీవి.
సినిమా అంటే ప్యాషన్‌తో ఉంటారని, షూటింగ్‌లోనే అన్నీతానై చూస్తారని, ఎంతో కమిట్మెంట్‌తో వర్క్ చేస్తారని, అందుకే ఆయనంటే తనకు అడ్మిరేషన్ అని చెప్పారు చిరు. అందుకే ఆయన అడిగి అడగ్గానే తెలుగులో సమర్పకులుగా ఉండేందుకు ఒప్పుకున్నారనని, అయితే ఆయన రిక్వెస్ట్ చేస్తుంటే తనకు చాలా ఎంబారిజన్‌గా అనిపించిందని, అది తన తన బాధ్యత అని, ఇలాంటి మంచి సినిమాలని అందించాల్సిన బాధ్యత అని, ఎంతో గౌరవింతో ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవరిస్తున్నానని చెప్పారు చిరు.
