Asianet News TeluguAsianet News Telugu

బాస్ పార్టీ... వాల్తేరు వీరయ్య టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ పార్టీ

కొత్త ఏడాది కొత్త సినిమాలతో ఫ్యాన్స్ ను అరించడానికిరెడీ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్యను రిలీజ్ కు ముస్తాబు చేస్తున్నారు. ఈక్రమంలో మూవీ టీమ్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు మెగాస్టార్. 
 

Chiranjeevi Grand New Year  Party For Waltair Veerayya Team
Author
First Published Jan 3, 2023, 9:07 AM IST


ఈ ఏడాది కొత్త సినిమాలతో అభిమానులకు అలరించడానికి రెడీగా ఉన్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.  ముందుగా వాల్తేరు వీరయ్య సినిమాతో రెడీగా ఉన్నారు చిరు.  వాల్తేరు వీరయ్య  సినిమాతో 2023లో బాక్సాఫీస్‌ దగ్గర తన సత్తా చాటడానికి సై అంటున్నాడు. మరో ఇద్దరు స్టార్ హీరోలుపోటీకి ఉన్నా.. తన సినిమాతో గ్రాండ్‌ ఓపెనింగ్స్ రాబట్టేందుకు సిద్దమవుతున్నాడు మెగాస్టార్. ఈక్రమంలో మూవీ విషయంలో రిలీజ్ కు ముందుగానే దిల్ ఖుష్ గా ఉన్న చిరంజీవి.. టీమ్ కు గ్రాండ్ న్యూ ఇయర్ పార్టీ ఇచ్చారు. 

న్యూ ఇయర్ సందర్భంగా మూవీ టీమ్ తో సరదగాగా గడిపారు మెగాస్టార్ చిరంజీవి.  యూనిట్‌ సభ్యుల కోసం పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో దాదాపు టీమ్ అంతా సందడి చేశారు. డైరెక్టర్ బాబీతోపాటు మాస్ మహారాజ్ రవితేజ, నిర్మాతలు రవిశంకర్‌, నవీన్ యేర్నేని, శేఖర్‌ మాస్టర్‌, రామ్-లక్ష్మణ్‌,  వెన్నెల కిశోర్‌తోపాటు ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్.. ఇక వాల్తేరు వీరయ్య కోసం కష్టపడ్డవారందరికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు చిరు. 

 

అంతే కాదు ఈ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు మెగాస్టార్ .. వాల్తేరు వీరయ్య టీం కోసం పార్టీ ఇక్కడ.. అంటూ పార్టీ లో ఉన్నపుడు ఫుల్ ఆన్ లో ఉంది..  టీంతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు చిరంజీవి. ఈ స్టిల్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ ట్వీట్ కుఅభిమానులు వరుస కామెంట్లు చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సెన్సేషన్ క్రియేట్ చేయాలంటున్నారు. 

ఇక వాల్తేరు వీరయ్య సెన్సార్‌ కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.  సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్.. భారీ  బడ్జెట్‌తో  తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి జంటగా  శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా బాస్‌ పార్టీ సాంగ్‌లో 
సందడిచేయబోతోంది. ఇక మెగా  మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీకి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇక సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య  జనవరి 13న  ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా  రిలీజ్కాబోతోంది. 

ఇప్పటికే  వాల్తేరు వీరయ్య.. ఆడియన్స్ తో పాటు.. అభిమానుల్లో కూడా  పాటలు, ప్రమోస్ తో ఫుల్ లోడ్ చేసి ఉంచాడు. ఈసినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.ఇకఈసినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని సినిమాలనులైన్ లో ఉంచారు. మోహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరంజీవి.. వెంకీ కుడుములకు కూడా ఓ  మూవీ అవకాశం ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య సినిమా తరువాత ఆ సినిమాల అప్ డేట్స్ గురించి అప్ డేట్ తెలిసే అవకాశం ఉంది. .

Follow Us:
Download App:
  • android
  • ios