సాధారణంగా తెలుగులో విడుదలయ్యే సినిమాలు ఎక్కువ భాగం తమిళ మలయాళ భాషలలో కూడా విడుదలవుతాయి అయితే గాడ్ ఫాదర్ సినిమాని తమిళంలో విడుదల చేయడానికి మేకర్స్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
దశమి సందర్భంగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా విడుదల చేశారు. ఊహించని విధంగా రీమేక్ ని మర్చిపోయేలా రూపొందించబడి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీ ఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు హిందీ భాషలలో విడుదల చేసారు. అక్కడా సల్మాన్ ఖాన్ ఉండటం,చిరుకు ఉన్న క్రేజ్ తో మంచి వసూళ్లే వస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా విడుదల చేసి ఉంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు స్పందిస్తూ… సాధారణంగా తెలుగులో విడుదలయ్యే సినిమాలు ఎక్కువ భాగం తమిళ మలయాళ భాషలలో కూడా విడుదలవుతాయి అయితే గాడ్ ఫాదర్ సినిమాని తమిళంలో విడుదల చేయడానికి మేకర్స్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అయితే అందుకు కారణం తెలిసింది. తెలుగు, హిందీతో పాటుగా తమిళంలోనూ దసరా రోజున గాడ్‌ఫాదర్ సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. కానీ తమిళ్ వెర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో వారం రోజులు వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదంటూ నిర్మాత ప్రకటించారు.
నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ...తమిళనాడులో పొన్నియన్ సెల్వన్ అద్బుతంగా ఆడుతోంది. అది వారి కల్చర్ మూవీ. వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ గాడ్ ఫాధర్ రిలీజ్ ఆపుకున్నాము అని తెలియచేసారు. దాంతో తమిళంలో మాత్రం వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అక్టోబర్ 14న (శుక్రవారం) గాడ్‌ఫాదర్ తమిళ్ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితమే రజనీకాంత్ ఈ సినిమా చూసి బాగుందని కితాబు ఇచ్చారు. దాంతో అక్కడా మెల్లిగా క్రేజ్ క్రియేట్ అవుతోంది.
తమిళంలో నయనతారతో పాటు దర్శకుడు మోహన్‌రాజాకు ఉన్న క్రేజ్ గాడ్‌ఫాదర్‌కు కలిసివస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. . తనిఒరువన్‌తో పాటు మోహన్‌రాజా దర్శకత్వం వహించిన పలు తమిళ సినిమాలు పెద్ద విజయాల్ని అందుకున్నాయి. మరోవైపు నయనతార కూడా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నది.ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా నయనతార (Nayanthara) నటించింది. ఆమె భర్తగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో సత్యదేవ్ నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రను పోషించాడు. మలయాళం చిత్రం లూసిఫర్ ఆధారంగా గాడ్‌ఫాదర్ సినిమా రూపొందింది.
మోహన్ రాజా డైరెక్షన్లో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, అనసూయ, షఫీ కీలకపాత్రలు పోషించారు. కే ‘గాడ్ ఫాదర్’ మూవీలో డైలాగులు.. నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. మరోవైపు ఇన్నాళ్లు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్నారు. ఒక్కక్కళ్లు.. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా.. ఇందులో ఒకటే రూల్.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించే నిర్ణయం, తప్పచేయ్యాలంటే ఓ భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి.. లేదంటే .. మీ ఊపరి గాల్లో కలిసిపోతుంది. అంటూ చెప్పిన మరో డైలాగు కూడా పాపులర్ అయింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి జన జాగృతి పార్టీని కాపాడే గాడ్ ఫాదర్ పాత్రలో కనిపించారు చిరంజీవి.
