Asianet News TeluguAsianet News Telugu

మెగా.. అక్కినేని ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసిన నందమూరి హీరో, ఏం చేశాడంటే...?

టాలీవుడ్ లో బాస్ అంటే చాలా వాల్యూ ఉంది. బాస్ అంటూ..  ముందు మెగాస్టార్ చిరంజీవిని, ఆతరువాత కింగ్ నాగార్జునను పిలుస్తారు.  కానీ రీసెంట్ గా ఈ టైటిల్ మెగా, అక్కినేని అభిమానుల నుకన్ ఫ్యూజన్ లో పడేసిందట.. అది కూడా నందమూరి హీరో వల్ల.. ఎందుకలా..? 

chiranjeevi and Nagarjuna Fans confused with Taraka Ratna film
Author
First Published Sep 9, 2022, 10:21 AM IST

టాలీవుడ్ లో బాస్ అంటే చాలా వాల్యూ ఉంది. బాస్ అంటూ..  ముందు మెగాస్టార్ చిరంజీవిని, ఆతరువాత కింగ్ నాగార్జునను పిలుస్తారు.  కానీ రీసెంట్ గా ఈ టైటిల్ మెగా, అక్కినేని అభిమానుల నుకన్ ఫ్యూజన్ లో పడేసిందట.. అది కూడా నందమూరి హీరో వల్ల.. ఎందుకలా..? 

తెలుగు చిత్రపరిశ్రమలో  బాస్ అనగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు వస్తారు. ఇండస్ట్రీకి ఇప్పుడు ఆయే బాస్ అని వేరే చెప్పనక్కర్లేదు. మెగా అభిమానులతో పాటు.. టాలీవుడ్ అంతా దాదాపుఅలానే చూస్తారు. ఇక ఆతరువాత బాస్ అనే పేరును ఉపయోగించింది మాత్రం కింగ్ నాగార్జున ఒక్కరే ఆ టైటిల్ తో ఆయన సినిమా చేసి సక్సెస్ సాధించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ చేసేందుకుకు మరో హీరో బాస్ గా రాబోతున్నాడు. అది కూడా నందమూరి హీరో.. బాస్ గా మారిపోయాడు.  

చిరు, నాగ్ తరువాత బాస్ గా నందమూరి  హీరో తారక రత్న మారబోతున్నాడు.  అప్పుడప్పుడు అలా  కనిపిస్తూ.. ఒకటి రెండు సినిమాలు చేసి..ఇలా మాయామైపోతుంటాడు తారకరత్న. అలాంటి తారకరత్న తనసినిమాతో చిరు, నాగ్‌లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు తారకరత్న హీరోగా నటించిన బాస్ సినిమాను వచ్చే  అక్టోబర్ 5న దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా..ప్యాన్స్ లో చర్చకు దారి తీస్తుంది. 

ఎందుకంటే అదే రోజున చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్, కింగ్ నాగార్జున నటించిన  ది ఘోస్ట్   సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  ఇక వారికి పోటీగా ఇప్పుడు తారక రత్న కూడా బాస్ ని దించుతుండటంతో.. ఆరోజు నందమూరి ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేయడం ఖాయం అన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఈ పోస్టర్ ను చూపుతూ రకరకాల మీమ్స్.. దర్శనం ఇస్తున్నాయి. బాస్ పేరుతో సోషల్ మీడియా శేక్ అవుతోంది. మరి ఈసినిమాతో తారకరత్నం హిట్ కొడతాడా లేదా తెలియదు కాని.. మెగా, అక్కినేని ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఓ బాస్ వచ్చిలిస్ట్ లో చేరుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios