గత ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్న రాజీవ్‌ సేన్‌, చారు అసోపాలు విడాకులకు సిద్దమవుతున్నట్టుగా బాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజీవ్‌ బాలీవుడ్‌ సీనియర్‌ నటి సుస్మిత సేన్‌ సోదరుడు అన్న విషయం తెలిసిందే. చారు అసోపా బాలీవుడ్‌ బుల్లితెర స్టార్ యాక్ట్రస్‌.పెళ్లి అయిన కొంత కాలం వరకు ఎంతో సన్నిహితంగా ఉన్న వీళ్ల మధ్య తరువాత మనస్పర్థలు తలెత్తినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఇద్దరు స్టార్స్ తమ సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి పార్ట్‌నర్స్‌కు సంబంధించి ఫోటోలను డిలీట్‌ చేయటం హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో తమ ఇంటిమేట్‌ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి విమర్శల పాలైయ్యారు ఈ జంట. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి తరువాత రాజీవ్‌ సేన్‌ పేరులోని సేన్‌ను తన పేరులో చేర్చుకున్న చారు, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సేన్‌ అన్న పదాన్ని కూడా తొలగించింది. ఇద్దరు తన సోషల్ మీడియా అకౌంట్స్‌ నుంచి కలిసున్న ఫోటోలను డిలీట్ చేయటంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని భావిస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ప్రస్తుతం రాజీవ్‌ ఢిల్లీలో ఉంటుండగా, చారు ముంబైలో ఉంటుంది. తాజాగా రాజీవ్‌ `ఇతి: కెన్‌ యు సాల్వ్‌ యువర్‌ ఓన్‌ మర్డర్‌?` అనే సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.