బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ 12వ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా మొదలుపెట్టి చాలా రోజులవుతున్నా అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఏమి రాలేదు. అయితే ఈ దసరాకి చిత్ర యూనిట్ అభిమానులకు ఒక మంచి కిక్ ఇవ్వనుందని సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతో అసలైన బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. నటనపరంగా కూడా చెర్రీ మంచి మార్కులు కొట్టేశాడు. ఇకపోతే నెక్స్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కష్టపడుతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ 12వ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

అయితే సినిమా మొదలుపెట్టి చాలా రోజులవుతున్నా అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఏమి రాలేదు. అయితే ఈ దసరాకి చిత్ర యూనిట్ అభిమానులకు ఒక మంచి కిక్ ఇవ్వనుందని సమాచారం. సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ ని కూడా అక్టోబర్ 19వ తేదీ నాడు రిలీజ్ చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబందించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 

రామ్ చరణ్ ఎప్పుడు లేని విధంగా సరికొత్త ఫిజిక్ తో కనిపిస్తాడని టాక్. బాడీపై స్టయిలిష్ టాటూలతో కనిపిస్తాడని బోయపాటి యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషన్ కి కూడా సినిమాలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కైరా అధ్వాని నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.