వచ్చే నెల దుబాయ్ లో జరగనున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) సన్నాహక కార్యక్రమంలో టాలీవుడ్ తారలు సందడి చేశారు. సైమా అవార్డుల ప్రదానం వచ్చే నెల సెప్టెంబర్ 14, 15 తేదీల్లో దుబాయ్ లో జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్లో సన్నాహక(కర్టెన్ రైజర్) కార్యక్రమంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో తీసిన బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ కి వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ 'సైమా ప్రారంభమై అప్పుడే ఆరేళ్ళు అయింది అంటే నమ్మలేకపొతున్నాను. నేను సైమా అవార్డు ఫంక్షన్ తోనే యాంకర్ అయ్యా. అందుకే నాకు సైమాతో ప్రత్యేక అనుబంధం వుంది. ఇపుడు 7వ సైమా అవార్డు ల కార్యక్రమం జరుగుతోందంటే సంతోషం గా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ కి సైమా అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడ వల్ల యంగ్ టాలెంట్ బయటకు వస్తుంది. మేము మా సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా షార్ట్ ఫిలిమ్స్ తీసిప్రోత్సహించాం. షార్ట్ ఫిలిమ్స్ కి అంత ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు ఇలాంటి టాలెంట్ చూపిన తెలుగు, కన్నడ భాషల్లో షార్ట్ ఫిలిమ్స్ తీసిన వారికి వివిధ విభాగాల్లో అవార్డులు ఇచ్చి సైమా ప్రోత్సహిస్తోంది' అన్నారు

హీరోయిన్ ప్రణీత సుభాష్, ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ... ఎంతో మంది టాలెంట్ ఆర్టిస్టులను సైమా అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడవల్ల ఇదో బ్రాండ్ గా మారింది. అందుకే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాం అన్నారు.

సైమా చైర్ పర్సన్ అడుసుమల్లి బృందా ప్రసాద్ మాట్లాడుతూ... ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహస్తున్నాం. సినిమా తారలను ప్రోత్సహించడానికి సైమా అవార్డులు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాంటలూన్ ప్రతినిధి గౌరవ్ చక్రవర్తి, శుభ్ర అయ్యప్ప, శాన్వి, తరుణ్ భాస్కర్, వర్షిని, అంజు అష్రాని తదితరులు పాల్గొన్నారు.