Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ పై కేసు!

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ పై కేసు నమోదు చేశారు. ఆయన నటించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమా వివాదాలకు దారి తీయడంతో సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోన్న అనుపమ్ ఖేర్ తో పాటు చిత్రయూనిట్ పై బీహార్ న్యాయస్థానంలో సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది పిటిషన్ వేశారు. 

Case Filed Against Anupam Kher
Author
Hyderabad, First Published Jan 3, 2019, 11:25 AM IST

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ పై కేసు నమోదు చేశారు. ఆయన నటించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమా వివాదాలకు దారి తీయడంతో సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోన్న అనుపమ్ ఖేర్ తో పాటు చిత్రయూనిట్ పై బీహార్ న్యాయస్థానంలో సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది పిటిషన్ వేశారు.

ఈ సినిమా ద్వారా పేరున్న నేతలను తప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. న్యాయస్థానం పిటిషన్ ని స్వీకరించింది. ఈ నెల 8న విచారణ జరపనున్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారణంగా రూపొందిస్తోన్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాను విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేశారు.

సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తుండగా, ఆయన సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తూ వారి పరువు తీశారని, ఇది తనను ఎంతో బాధించిన లాయర్ ఓజా అన్నారు.

సినిమాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి పాత్రలలో నటించినవారు కూడా వారి ఇమేజ్ ని దెబ్బతీశారని..  దర్శకనిర్మాతలపై ఫిర్యాదు చేశారు ఓజా. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా సినిమాలో మార్పులు చేసేవరకు విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios