Asianet News TeluguAsianet News Telugu

‘ఇప్పుడుకాక ఇంకెప్పుడు’ మూవీపై కేసు నమోదు,బూతు సీన్స్ లో అలా

  హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఈ చిత్ర ట్రైలర్ లో సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

Case file on ippudu kaaka inkeppudu movie
Author
Hyderabad, First Published Aug 4, 2021, 7:37 AM IST

ఈ నెల ఆరవ తేదీన విడుదల కాబోతున్న ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.  హస్వంత్ వంగ , నమ్రతా దరేకర్ , వశిష్ట చౌదరి ప్రధాన పాత్రల్లో వై .యుగంధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.  ఈ చిత్రంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

 శ్రీ వెంకటేశ్వర స్వామిని పవిత్రంగా కీర్తించే… భజగోవిందం కీర్తన తో బెడ్ రూమ్ సన్నివేశాలు అసభ్యంగా చిత్రీకరించి… శ్రీకృష్ణ పరమాత్మను మరియు తులసి మాతను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది.ఈ ఫిర్యాదును విహెచ్ పి రాష్ట్ర అధికార ప్రతినిధి రవి నూతన శశిధర్ మరియు బిజెపి మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా రెండు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

 ఓ శృంగార సన్నివేశంలో భజగోవిందం అనే పాట పలువురి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని భావించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందూ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు.  67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ కింద కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు.

కాగా, దీనిపై దర్శకుడు యుగంధర్‌ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ విషయంలో ఒక పొరపాటు జరిగింది. అది కావాలని చేసింది కాదు. ఈ సినిమాలో ఉన్న ఇంకొక పాటలోని బ్యాగ్రౌండ్‌ స్కోరును తీసుకొచ్చి, ట్రైలర్‌లో రాంగ్‌ ప్లేస్‌లో పెట్టడం వల్ల ‘భజగోవింద’ అనే మాట ప్లే అయింది. నేనూ గమనించలేదు. అందుకు క్షమాపణలు కోరుతున్నా. ఏదైనా పొరపాటు పొరపాటే. ఆ పదాన్ని తొలగించాం’’ అని అన్నారు. 

హస్వంత్ వంగా, నమ్రత దారేఖర్ కతల్యాన్ గౌడ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో  తనికెళ్ళ భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజ రామచంద్రన్, ఐడ్రీమ్ అంజలి, అప్పాజీ అంబరీష్, రాజా శ్రీధర్, జబర్దస్త్ రాఘవ, రాయ్ సింగ్ రాజు, వశిష్ఠ చౌదరి, నోమినా తార, నిఖిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ; జెమిన్ జామ్ అయ్యనేత్, మ్యూజిక్; సాహిత్యా సాగర్, ఎడిటర్; శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, కోరియోగ్రఫి; శ్రీ క్రిష్, లిరిక్స్; సాహిత్యా సాగర్, సురేష్ బానిశెట్టి, ఆర్ట్; బాబా అర్మోన్, పీఆర్ఓ; వంశీ-శేఖర్, నిర్మాత; చింతా గోపాలకృష్ణ రెడ్డి, రచన- దర్శకత్వం; వై. యుగంధర్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios