సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న  ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ కోసం మహేశ్  బాబు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సాంగ్ ఎవరు పడబోతున్నారనే అంశంపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.  

ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా కొన్ని సీన్ల చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్టు ఇటీవల మూవీ మేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే ఇప్పటికే మహేశ్ బాబు మూవీ థియేటర్లలోకి రావాల్సి ఉన్నా కాస్తా ఆలస్యమైంది. దీంతో ఆయన ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు. 

ఈ క్రమంలో సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ సింగిల్ ను ఫిబ్రవరి 14కు రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ నెంబర్ ని ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చెయ్యనున్నారు. మరి ఈ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ ఫస్ట్ సాంగ్ ని ఎవరు పాడారో అనేది తెలుస్తుంది. ఇద్దరి సెన్సేషనల్ సింగర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

తొలుత స్టార్ సింగర్, లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్ సిద్ శ్రీరామ్ పేరు వినిపించగా ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ అనిరుద్ పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరు పాడి ఉన్నట్టు టాక్. అయితే ఈ ఇద్దరిలో ఎవరైనా ‘కళావతి’ సాంగ్ అదిరిపోవాల్సిందేనని నెట్టింట పలువురు నెటిజన్లు అంటున్నారు. గతంలో ‘చారుశీల’, ‘వసుమతి’ పాటలు టైటిల్ ఫీమేల్ వచ్చి అదరగొట్టాయి. అయితే మళ్లీ అదే తరహాలో హీరోయిన్ పేరుతో సాంగ్ ఉంటే దుమ్మరేగితుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

ఇక బ్యాకింగ్ రంగం నేథప్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహస్తున్నారు. ఈ మూవీ ఎప్పడూ పూర్తై థియేటర్లలోకి వస్తుందా అని ఆడియేన్స్ ఎదురు చూస్తున్నారు. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.