Asianet News TeluguAsianet News Telugu

సెటిల్‌మెంట్ చేయాల్సిందే.. హీరోపై ఒత్తిడి!

తెలుగబ్బాయి అయినప్పటికీ తమిళంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో విశాల్. అక్కడ ప్రముఖ హీరోల్లో ఒకరిగా మారాడు. తెలుగులో కూడా మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. అతడు నటించిన గత చిత్రం 'అభిమన్యుడు'కి ఇక్కడ ప్రేక్షకాదరణ దక్కింది. 

buyers effect on vishal pandemkodi 2
Author
Hyderabad, First Published Oct 6, 2018, 3:48 PM IST

తెలుగబ్బాయి అయినప్పటికీ తమిళంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో విశాల్. అక్కడ ప్రముఖ హీరోల్లో ఒకరిగా మారాడు. తెలుగులో కూడా మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. అతడు నటించిన గత చిత్రం 'అభిమన్యుడు'కి ఇక్కడ ప్రేక్షకాదరణ దక్కింది. 

ప్రస్తుతం విశాల్ నటించిన 'పందెంకోడి2' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ మాసివ్ గా ఉండడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. పైగా దసరా సీజన్ లో సినిమాను వదలడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నాడు.

ఈ క్రమంలో అతడికి బయ్యర్ల నుండి ఒత్తిడి మొదలైందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. విశాల్ సినిమాలు కొని నష్టపోయిన బయ్యర్లంతా ఒక్కటిగా తయారై విశాల్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట.అభిమన్యుడు కాకుండా అంతకముందు విశాల్ నటించిన సినిమాలు కొని నష్టపోయిన వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

విశాల్ కూడా వీటన్నింటినీ సెటిల్ చేయాలని చూస్తున్నాడట. అయితే బయ్యర్లు అడిగినంత మొత్తాన్ని మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేరట. ఎంతోకొంత ముట్టజెప్పి తప్పించుకోవాలని విశాల్ భావిస్తున్నాడు.

కానీ తమ బాకీలు తీరకుండా 'పందెంకోడి2' సినిమా రిలీజ్ అవ్వనివ్వమని బయ్యర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చర్చలు సీరియస్ గా జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ సెటిల్మెంట్ సంగతి ఏమవుతుందో చూడాలి! 
 

Follow Us:
Download App:
  • android
  • ios