‘ఉప్పెన’ సక్సెస్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు బుచ్చి బాబు సానాల‌. దాంతో బుచ్చి బాబుతో పనిచేయడానికి చాలా మంది నిర్మాతలు, హీరోలు ఆసక్తిచూపించారు. అయితే ఈ దర్శకుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే చాన్స్‌ను కొట్టేసాడు. గతంలో సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు బుచ్చిబాబు సహాయక దర్శకుడిగా పనిచేశాడు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని ఈ కారణంగానే ఎన్టీఆర్‌ బుచ్చిబాబుకు చాన్స్‌ ఇస్తున్నాడని అంటున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను ప్లాన్‌ చేస్తోందని. విశాఖపట్నం నేపథ్యంలో పీరియడ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని టాక్‌ నడుస్తోంది. 

అయితే ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలంటే ఏడాది పాటు ఆగాల్సిన సిట్యువేషన్ ఉంది. దాంతో పూర్తిగా స్క్రిప్టుపై బుచ్చిబాబు కసరత్తులు చేస్తున్నాడు. ఉప్పెన ని మించి హిట్ కొట్టాలనే తాపత్రయంతో రాత్రింబవళ్లు వర్క్ చేస్తున్నారట. అయితే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని రావాలి. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా చేయాలి. ఈ రెండు పూర్తయ్యే సరికి ఈ సంవత్సరం పూర్తవుతుంది. దాంతో జూన్ 2022 దాకా బుచ్చిబాబు వెయిట్ చెయ్యాల్సిన సిట్యువేషన్. ఈలోగా కొత్తవాళ్లతో చిన్న లవ్ స్టోరీ చేద్దామని ప్రపోజల్ వచ్చినా ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తానని చెప్పారట. సుకుమార్ రైటిగ్స్, మైత్రీ మూవి మేకర్స్ ఈ ప్రాజెక్టుని కలిసి నిర్మిస్తాయి.
 
ఎన్టీఆర్ ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేశారు. ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ సినిమాను మైత్రీ సంస్థ రూపొందించింది. ఇక ‘కె.జి.యఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరవాతే బుచ్చిబాబుతో ఎన్టీఆర్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఏది నిజమో తెలియాల్సి ఉంది.