దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 'వినయ విధేయ రామ' సినిమా తరువాత ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బాలకృష్ణ మాత్రం ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అది కూడా 'వినయ విధేయ రామ' సినిమా రిలీజ్ అవ్వకముందు.. సినిమా ఫాప్ అవ్వడంతో బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా బోయపాటితో సినిమా చేయాలనే ఆలోచన విరమించుకొని హీరోగా సినిమా చేస్తానని చెప్పారట. దాంతో నిర్మాతని వెతికే పనిలో పడ్డాడు బోయపాటి.

ఈ సినిమాకి బోయపాటి వేసిన బడ్జెట్ రూ.70 కోట్లు.. ఇంత భారీ మొత్తం పెట్టి బోయపాటితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడ మరో విషయమేమిటంటే.. ఈ డెబ్బై కోట్లలో బోయపాటి తన రెమ్యునరేషన్ గా రాసుకున్న మొత్తం పది కోట్లు.. తన రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడుగుతున్నా.. పది కోట్లకు తగ్గేదే లేదని చెబుతున్నాడట.

హిట్లలో ఉంటే నిర్మాతలు కూడా అంత మొత్తాన్ని ఇవ్వడానికి వెనుకాడేవారు కాదు.. కానీ ఇప్పుడు బోయపాటి సినిమాలకు బాగా డిమాండ్ తగ్గింది. ఇలాంటి నేపధ్యంలో ఆయన రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం, సినిమా బడ్జెట్ పెంచేయడంతో అతడిని నమ్మేవారు లేకుండా పోయారు.