మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను భద్ర సినిమాతో 2005లో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలెట్టి తులసి - సింహా సినిమాలతో మొదట్లోనే హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నాడు. ఆ తరువాత దమ్ముతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ లెజెండ్ - సరైనోడు సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు. ఇక జయ జానకి నాయక అలాగే రీసెంట్ గా వినయ విధేయ రామతో ఊహించని అపజయాల్ని అందుకొని కెరీర్ ను సందిగ్ధంలో పడేసుకున్నాడు.

ఇప్పుడు ఆ రెండు సినిమాల ఎఫెక్ట్ వల్ల స్టార్ హీరోలు బోయపాటి కనిపించగానే డోర్లు క్లోజ్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతానికి బాలయ్య అయితే సినిమా చేయడానికి సిద్దంగానే ఉన్నాడు. అయితే మహేష్ బాబుతో కూడా బోయపాటి ఒక సినిమా చేయాలనీ గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నాడు. సరైనోడు తరువాత కథ వినడానికి ఒప్పుకున్నా మహేష్ ఇప్పుడు చరణ్ కి ఇచ్చిన రిజల్ట్ తో డోర్స్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. 

బోయపాటి శ్రీను కథ వినడానికి మహేష్ కు సమయం దొరకడం లేదట. మహర్షి అలాగే ఇతర యాడ్స్ తో బిజీగా ఉన్నట్లు చెబుతూ తరువాత కబురు చేస్తామని మహేష్ ఆఫీస్ నుంచి న్యూస్ వదులుతున్నాడట. ఇప్పుడు బోయపాటి దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం బాలయ్య సినిమా. ఆ సినిమా హిట్టయితేనే మళ్ళీ తన క్రేజ్ ను పెంచుకోవచ్చు. కొత్తగా ట్రై చేస్తేనే బోయపాటి హిట్ కొట్టగలడు. మళ్ళీ అదే రొటీన్ ఫార్ములా అయితే హిట్టు కొట్టిన మహేష్ లాంటి హీరోలు ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. మరి బోయపాటి కొత్త ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో చూడాలి.