Boyapati: బోయపాటి 60 కోట్ల రిస్క్ మ్యాటర్... ఇండస్ట్రీ షాక్


'భద్ర', 'తులసి', 'సింహ', 'దమ్ము', 'లెజెండ్', 'సరైనోడు', 'జయ జానకి నాయక', 'అఖండ'... బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ చిత్రాలు చేశారు. అయితే... సినిమా, సినిమాకు మధ్య ఆయనకు విరామం వస్తోంది. కానీ, ఈసారి విరామం లేకుండా 'అఖండ' విడుదలైన వెంటనే కొత్త సినిమా ప్రకటించారు.

Boyapati 100 Crore Feat With Hero Ram?


తెలుగు ఇండస్ట్రీకి వరసపెట్టి బ్లాక్‌బస్టర్‌ హిట్లు అందించిన  దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవలే నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి 'అఖండ' ద్వారా మరో సూపర్‌ డూపర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడీ డైరెక్టర్‌. 50 రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్స్‌ సాధించి రికార్డులను తిరగరాసిందీ మూవీ. ఓటీటీలో కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'అఖండ' సినిమాతో బోయపాటి రేంజ్‌ పెరిగింది. దీంతోతను నిర్మించే చిత్రాల బడ్జెట్ ని పెంచుకుంటూ పోతున్నారట బోయపాటి శ్రీను. అవతల హీరోకు ఎంత మార్కెట్ ఉందనే విషయం ప్రక్కన పెట్టి తమ మార్క్ హీరోయిజం సీన్స్ కు ప్రాణం పోసి..డిమాండ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. అందుకోసం ఆ ఆ హీరోలకు ఉన్న మార్కెట్ ని పెంచేసి రిస్క్ చేస్తున్నారనే టాక్ మార్కెట్ లో వినపడుతోంది.
 
తాజాగా ఈ మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను-యంగ్‌ హీరో రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతోంది. బోయపాటి, రామ్ కలయికలో తొలి చిత్రమిది. పాన్ ఇండియా లెవల్‌లో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. హిందీలో డబ్బింగ్ అయ్యాయి. ఆయన సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల్లో డిమాండ్ ఉంది. మరోవైపు రామ్ సినిమాలకు కూడా హిందీలో సూపర్ మార్కెట్ ఉంది. రామ్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా... మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో సినిమా అంటే కచ్చితంగా నార్త్‌లో డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. ఆ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని.. 80 కోట్ల భారీ బడ్జెట్ ని ఈ సినిమాపై ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారట. వంద కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేసి ఈ బడ్జెట్ వేసారట.

అఖండ ఇచ్చిన ఉత్సాహంలో బోయపాటి ఈ స్దాయి బడ్జెట్ కు సిద్దపడ్డాడంటున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. రామ్ గత చిత్రం రెడ్ కేవలం 13 కోట్లు మాత్రమే భాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. మొత్తం ఈ సినిమాకు 16 కోట్లు మాత్రమే బిజినెస్ అయ్యింది. అలాంటప్పుడు వంద కోట్లు బిజినెస్ రామ్ సినిమాకు జరుగుతుందా అంటున్నారు. అన్ని కలిపినా 40కోట్లు బిజినెస్ చేయటం సాధ్యం అంటున్నారు. అలాంటప్పుడు రిస్క్ 60 కోట్లు దాకా ఉంటుంది. సినిమా సక్సెస్ అయితే పెద్ద సమస్య కాదు. రామ్ పెద్ద హీరో అవుతాడు. కాకపోతే మాత్రం ఇబ్బంది పడిపోవాల్సి వస్తుందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.
 
 దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా కాగా.. రామ్‌కు ఇది 20వ సినిమా. ప్రస్తుతం రామ్.. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బోయపాటి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు పెట్టనున్నాడట. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమాలో రామ్‌కు అక్కగా సీనియర్‌ హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios