Asianet News TeluguAsianet News Telugu

వెరైటిగా ఉందే : 'కోలా' ఓ చోట, ' పొలిమేర ' ఇంకోచోట...కుమ్ముతున్నాయి

‘కీడా కోలా’ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.6.03 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ‘మా ఊరి పొలిమేర 2’ తొలిరోజు రూ.3 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు ‘పొలిమేర 2’ మేకర్స్ కూడా ఒక పోస్టర్‌ను వదిలారు. 

Both #KeedaaCola #MaaOoriPolimera2 have managed to gross 10 Cr apx in the Weekend jsp
Author
First Published Nov 7, 2023, 11:45 AM IST


మొన్న శుక్రం వారం రిలీజైనవి  అన్నీ  దాదాపు బడ్జెట్ సినిమాలే. అయితే వీటిల్లో చెప్పుకోదగినవి రెండు. ఒకటి తరుణ్ భాస్కర్ (TharunBhascker) నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'కీడా కోలా' #KeedaaCola. రెండోది  డాక్టర్ అనిల్ విశ్వనాధ్ (DrAnilViswanath) దర్శకత్వం వహించిన 'మా ఊరి పొలిమేర 2' #MaaOoriPolimera2. అవి కూడా రెండు పెద్ద బ్యానర్స్ ద్వారా రిలీజ్ అవటంతో అందరి దృష్టీ వీటిపై పడింది. తరుణ్ భాస్కర్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ (SureshProductions) ద్వారా విడుదలవ్వగా, 'మా ఊరి పొలిమేర' గీత ఆర్ట్స్ (GeethaArts) ద్వారా విడుదలైంది. వీటిలో, 'మా ఊరి పొలిమేర' చిత్రమే ప్రచారాల్లో  ముందుందని చెప్పాలి. ఈ రెండు చిత్రాల్లో ఏది ఎక్కువ వర్కవుట్ అయ్యింది అంటే దాదాపు రెండూ ఒకేలా భాక్సాఫీస్ దగ్గర పరుగులు పెడుతున్నాయి.

కీడాకోలా..  చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు తరుణ్. మేకింగ్‌కు కూడా బాగానే టైం పట్టింది. ఈ సినిమా ప్రోమోలు చూసి ప్రేక్షకులు చాలా ఎక్సపెక్ట్ చేసారు. ప్రి రిలీజ్ హైప్ కూడా బాగానే వచ్చింది. ఇందులో స్టార్ కాస్ట్ లేకపోయినా సరే.. అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే జరిగాయి. సిటీల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో అడ్వాన్స్ ఫుల్స్ పడటం కలిసొచ్చింది. అయితే ఏపీ లో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ కనపడటం లేదు. నైజాంలో,అలాగే ఓవర్ సీస్ లో ఈ సినిమా దుమ్ము రేపుతోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమాకు అక్కడ కలెక్షన్స్ చెప్పుకోదగిన రీతిలో ఉన్నాయి.

ఇక  'మా ఊరి పొలిమేర' మొదటి పార్టు ఓటిటి లో విడుదలై పెద్ద హిట్ అవటం కలిసొచ్చింది.  ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ 'మా ఊరి పొలిమేర 2' మీద ప్రేక్షకులకి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.  ఈ సినిమా బి,సి సెంటర్లలలో అలాగే ఆంధ్రాలోనూ బాగానే కలెక్ట్ చేస్తోంది. కీడా కోలా మల్టిఫ్లెక్స్ లలో వర్కవుట్ అయితే మా ఊరి పొలిమేర చిత్రం మాత్రం సింగిల్ స్కీన్స్ లో ఫుల్ అవుతోంది. రెండు సినిమాలు కూడా ఫస్ట్ వీకెండ్ దాటేసరికి 10 కోట్లదాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని  సమాచారం. ఏదేమైనా కొన్ని చోట్ల  ‘మా ఊరి పొలిమేర-2’ పూర్తి పూర్తిగా డామినేషన్ చూపించింది. ఓవర్ సీస్ లో  ‘కీడా కోలా’ డామినేషన్ నడుస్తోంది. ఇదో చిత్రమైన పరిస్దితి. చిన్న సినిమాకు మంచి రోజులు అన్నట్లే.
 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios