శ్రీదేవిని మేము మిస్ అవ్వడం లేదు.. బోనీకపూర్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 13, Aug 2018, 10:35 AM IST
boney kapoor emotional comment on sridevi over her birthday
Highlights

శ్రీదేవి చనిపోయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు ఇది.
 

తన భార్య శ్రీదేవిని తను, తన పిల్లలు మిస్ అవ్వడం లేదని  భర్త బోనీకపూర్ తెలిపారు. బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడిపోయి.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో శ్రీదేవి దుబాయిలోని ఓ హోటల్ లో మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ రోజు ఆమె జయంతి.  ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు.

‘‘చాలా మంది హీరోలు, లెజెండ్స్ ఉన్నారు. హీరోలను ఎవరూ గుర్తుచేసుకోలేకపోవచ్చు.. కానీ లెజెండ్స్ కి మాత్రం ఎప్పటికీ చావు ఉండదు. శ్రీదేవి కూడా ఒక లెజెండ్. ఆమె ఎప్పుడూ మాతోనే ఉంటుంది. అందుకే ఒక్క నిమిషం కూడా మేము శ్రీదేవిని మిస్ అవ్వడం లేదు’’ అని చెప్పారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు ఇది.

loader