Asianet News TeluguAsianet News Telugu

ఐశ్వర్యరాయ్ ని అంత మాట అన్నాడా..? ఇమ్రాన్ హష్మీపై విపరీతమైన ట్రోలింగ్..

ఐశ్వర్య రాయ్ పై హాట్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి.  దాంతో దారుణంగా ట్రోల్స్ ఫేస్ చేశాడు. అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు..? అసలు ఆయన ఏమన్నాడు..? ఇది ఎప్పుడు జరిగింది..? 

Bollywood Star Emraan Hashmi Comments about Aishwarya Rai JMS
Author
First Published Feb 24, 2024, 8:03 AM IST

స్టార్ సెలబ్రిటీలు ఒకరిపై ఒకరు కామెంట్లుచేసుకోవడం..  అవి వైరల్ అవ్వడం కామన్ గా జరుగుతున్న విషయంమే. ఇలాంటి విషయాల్లో స్టార్స్ స్పందించకపోయినా.. ఫ్యాన్స్ స్పందిస్తారు.. నెటిజన్లు గట్టిగా ట్రోల్స్ చేస్తుంటారు. ఇలా విచిత్ర పరిస్తితి ఏర్పడింది ఇండస్ట్రీలో. అంతే కాదు గతంలో జరిగిన విషయాలు కూడా చాలా కాలం తరువాత వైరల్ అవుతుంటాయి. ఇలాంటి ఘటనే జరిగింది బాలీవుడ్ లో. ఐశ్వర్య రాయ్ పై బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

గతంలో అంటే ఎప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం ఇమ్రాన్ హష్మీ.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్‌పై చేసిన కామెంట్స్ వల్ల ఇబ్బందుల్లో పడ్డాడట.  ఆ కామెంట్స్ వల్ల నెటిజన్ల నుంచి  విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కున్నారట. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?  2014 లో ‘కాఫీ విత్ కరణ్’  సీజన్ లో ఇమ్రాన్ హష్మీ  పాల్గొన్నారు. ఆ సమయంలో అతనికి ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది.  ర్యాపిడ్ ఫైర్‌ రౌండ్ లో ప్లాస్టిక్ అనే పదం ఏ నటితో పోలుస్తారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇమ్రాన్ అస్సలు ఆలోచించకుండా ఐశ్వర్యా రాయ్ పేరు చెప్పారట. 

ఇమ్రాన్ సమాధానంతో  షోలో అంతా షాకయ్యారట. ఈ ప్రశ్న షోలో ఉంచాలా? లేదా అనే డైలామాలో పడ్డ నిర్వాహకులు ఫైనల్‌గా ఉంచేసారట. ఇక అది అలానే ప్లే అవ్వడంతో.. ఐష్ అభిమానులు గట్టిగా హర్ట్ అయ్యారు.  ఇమ్రాన్ హష్మీని విపరీతంగా  ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారట. అయితే ఈ విషయం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఈ విషయంలో ఇమ్రాన్ ఏమన్నారంటే..?  నిజానికి తాను ఐశ్వర్యా రాయ్‌కి పెద్ద ఫ్యాన్ అని.. షోలో జరిగిన గేమ్‌లో భాగంగా తాను ఒక వస్తువును సెలబ్రిటీతో పోల్చి చెప్పమంటే సరదాగా తన పేరు చెప్పానని.. ఇందులో తప్పుడు ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారట ఇమ్రాన్ హష్మీ. 

ఇక ఈ విషయాన్ని తాజాగా ఓ సందర్భంలో వెల్లడించాడ ఇమ్రాన్. ఇక బాలీవుడ్ లోకి  అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి ఫుట్ పాత్ సినిమాతో హీరోగా మారిపోయాడు ఇమ్రాన్. ముద్దుల హీరో అని ఇమ్రాన్ కు బాలీవుడ్ లో ఇమేజ్ ఉంది. బెడ్ సీన్స్ లేకుండా అతను సినిమా చేసేవాడు కాదు అంటారు. ఇక వరుసగా ఇమ్రాన్ హష్మీ గ్యాంగ్ స్టర్, మర్డర్ 2, ది డర్టీ పిక్చర్, జన్నత్2 వంటి సినిమాల్లో రొమాంటిక్ పాత్రల్లో నటించాడు. హీరోయిన్స్ తో ఘాటుసీన్స్ చేయడంలో ఇమ్రాన్ మించిన హీరో బాలీవుడ్ లో లేరు అనే చెప్పాలి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిగా మారిపోయి.. డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. ఈమధ్యే సౌత్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు ఇమ్రాన్. పవర్ స్టార పవన్ కళ్యాన్ ఓజీ సినిమాతో పాటు  మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios